Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యోగాతో ఆ పని రేసుగుర్రంలా చేయొచ్చు.. ఇక మగాళ్లు ఆగుతారా..

యోగాతో ఆ పని రేసుగుర్రంలా చేయొచ్చు.. ఇక మగాళ్లు ఆగుతారా..

Oktelugu.com 21 hrs ago

Yoga Benefits for Men: ఒత్తిడి.. కాలుష్యం.. తీసుకునే ఆహారం.. తల్లిదండ్రుల నేపథ్యం.. కారణాలు ఏవైనా గాని నేటి కాలంలో యువకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ముఖ్యంగా కొన్ని సందర్భాలలో వారు తమ మగతనాన్ని చూపించుకోవడంలో బాధపడుతున్నారు. ఈ సమస్యను ఒకరికి చెప్పుకోలేరు. తమలో తామే మదన పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో రకరకాల మందులు వాడుతుంటారు. అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోగా.. శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంటాయి.

ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు.. ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు. ఖరీదైన మందులు కొనాల్సిన అవసరం లేదు. కేవలం శారీరక వ్యాయామం చేస్తే సరిపోతుంది. అలాగని గంటలు గంటలు చెమటలు చిందించాల్సిన అవసరం లేదు. ఒళ్ళును హూనం చేసుకోవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ యోగా చేస్తే చాలు. అవును మన ఎయిమ్స్ పరిశోధకులు పరిశీలనలో ఇది తేలింది.

ప్రతిరోజు యోగా చేయడం ద్వారా వంధ్యత్వ సమస్యలు తగ్గిపోతాయి. వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిపోతుంది. డిఎన్ఏ నష్టం కూడా తగ్గిపోతుంది. పురుషుల్లో పునరుత్పత్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పరిశోధన ను కొంతకాలంగా ఎయిమ్స్ వైద్యులు చేస్తున్నారు. వారి పరిశీలనలో యోగాతో పురుషుల్లో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని తేలింది.

ఈ పరిశోధన పత్రాలను యోగా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ప్రచురించారు.. వారి అధ్యయన ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పదిహేను శాతం జంటల్లో ఉన్న పురుషులు వంధ్యత్వ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ ప్రభాకర్ తివారి.. రీమా దాదా.. అంజలి యాదవ్.. రాజి కుమార్ ఆధ్వర్యంలో ఈ బృందం అధ్యయనం చేసింది. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దాదాపు 78 మంది పురుషులను పరిశీలించింది. వీరంతా కూడా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.

వీరిలో 42 మంది ప్రతిరోజు గంట చొప్పున.. వారానికి ఐదు రోజులు యోగాసనాలు.. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు.. ధ్యానం.. విశ్రాంతి వంటి వాటిని నిర్వహించారు. ఇలా 12 వలలో పాటు క్రమం తప్పకుండా చేశారు. అంతకుముందు వారి వీర్యంలో నాణ్యత.. యోగా చేసిన తర్వాత వీర్యం నాణ్యతను పరిశీలించారు. సంతానోత్పత్తిలో అత్యంత కీలకమైన వీర్యకణాల పారామితి లో పెరుగుదల కనిపించిందని పరిశోధకులు గుర్తించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com