Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
YSRCP : బోరుగడ్డ అనిల్ దారిలోనే అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీ అంటే అలా ఉంటుంది మరి..

YSRCP : బోరుగడ్డ అనిల్ దారిలోనే అనిల్ కుమార్ యాదవ్.. వైసీపీ అంటే అలా ఉంటుంది మరి..

Oktelugu.com 2 weeks ago

YSRCP : అధికారం ఉన్నప్పుడు ఎగిరి పడకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా నోరు వేసుకొని మీద పడిపోకూడదు. సాధ్యమైనంతవరకు రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూడాలి.

వ్యక్తిగత కక్షలతో ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. పవిత్రమైన అసెంబ్లీలో ఎవరి మెప్పు కోసమో ఇతరులను కించపరచకూడదు. ఎందుకంటే రోజులు అన్ని ఒకే విధంగా ఉండదు. అమావాస్య 15 రోజులు ఉన్నట్టుగానే.. పౌర్ణమి కూడా 15 రోజులు ఉంటుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనే సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా వైసీపీలో కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ నాయకులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. చంద్రబాబును తీవ్రంగా విమర్శించేవారు. వ్యక్తిగతంగా దూషించేవారు. నారా లోకేష్ నుంచి మొదలుపెడితే పవన్ కళ్యాణ్ వరకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. చివరికి వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయాల్లోకి లాగే వారు. అత్యంత పవిత్రమైన అసెంబ్లీలో రాక్షసకాండ కు పాల్పడేవారు. చివరికి అంతటి చంద్రబాబును సైతం ఏడిపించేదాకా వైసిపి నాయకులు నిద్రపోలేదు.

కాలం గిర్రున తిరిగిపోయింది. వైసిపి పరిపాలన ముగిసిపోయింది. కూటమి అధ్యాయం మొదలుపెట్టింది. ఏపీ రాష్ట్రాన్ని నవనిర్మాణ దిశగా తీసుకువెళ్తోంది. వాస్తవానికి నాడు వైసీపీలో ఉన్న నాయకుల మీద కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన దాఖలాలు లేవు. అర్ధరాత్రి పూట అరెస్టు చేసిన ఉదంతాలు కూడా లేవు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీ నాయకులకు ఆత్మ ప్రబోధానుసారం అనే మాట గుర్తుకువస్తుంది. అందువల్లే వాళ్ల నోటివెంట ప్రాయశ్చిత్తం వినిపిస్తోంది. ఇటీవల వైసిపి అధినాయకత్వం ఎలా వ్యవహరిస్తుందో బోర్గడ్డ అనిల్ బయట పెట్టారు. అనేక కేసులు ఎదుర్కొన్న తర్వాత.. వైసీపీ అధినాయకత్వం ఆయన పట్ల వ్యవహరించిన తీరును ఆయన బహిరంగంగానే బయటపెట్టారు. బోరుగడ్డ అనిల్ వ్యవహారం ముగిసిన తర్వాత.. ఇప్పుడు గతంలో నోటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ వంతు వచ్చింది. ఆయన ఏకంగా వైరాగ్యంతో మాట్లాడారు. రాజకీయాలు అంటేనే ఏవగింపుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నేతల తీరు సరిగా లేదని పేర్కొన్నారు. అంతేకాదు తాను త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి ఏపీ వైసీపీ నాయకులు ఒకటి తెలుసుకోవాలి. ఒక నాయకుడు మెప్పుకోసం.. ఆయన కళ్ళలో ఆనందం కోసం నోటికి పని చెప్తే.. ఆ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూస్తున్నారు కదా..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com