Thursday, 05 Aug, 5.10 pm Pakka Filmy

హోమ్
ఆ హీరో డివోర్స్ కి కారణం అయిన హీరోయిన్ ఎవరో తెలుసా ?

సినిమా పరిశ్రమలో భార్య భర్తలు విడిపోవడం అనేది ఎంతో సాధారణమైన విషయం. ఇటీవల కాలంలో ఈ విధంగా పెళ్లిళ్లు తెగతెంపులు చేసుకునే వారు ఎక్కువై పోతున్నారు. చిన్న కారణంతోనే విడిపోవడం ఎక్కువ అవుతుంది. ఈ రోజుల్లో నార్మల్ ప్రజలు కూడా ఈ విధంగా చేస్తున్నారు. సెలబ్రిటీలను ఆదర్శంగా తీసుకుని ప్రజలు కూడా ఇలా చేయడం ఎంతో బాధాకరమైన విషయం. అభిప్రాయాలు కుదరక మనసులు కలవక ఎంగేజ్మెంట్ కాగానే విడిపోయిన హీరోయిన్ లు చాలామంది ఉన్నారు. అలా హృతిక్ రోషన్ తన భార్య సుసేన్ ఖాన్ తో విడిపోయారు దానికి కారణం ఓ హీరోయిన్ అని అప్పట్లో వార్తలు రాగా అది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హృతిక్ రోషన్ కెరియర్ లో వెరైటీ చిత్రంగా మిగిలిపోతుంది కైట్స్. అనురాగ్ బసు దర్శకత్వంలో

బార్బరా మోరి హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ కంగనా రనౌత్ నటించింది. అక్కడ బార్బరా తో హృతిక్ రోషన్ కు మంచి స్నేహం ఏర్పడింది. వివిధ దేశాల్లో చిత్రీకరణ జరుపుకోవడంతో వీరు ప్యాకప్ అయ్యాక కాలక్షేపం కోసం బయటికి లాంగ్ డ్రైవ్ కోసం వెళ్ళినప్పుడు జర్నలిస్టులు దానిని రికార్డు చేసి తమ మధ్య ప్రేమ కథ నడుస్తుందని ప్రచారం చేశారు.

అప్పుడు ఈ వార్తలు విని ఎంతో బాధపడింది హృతిక్ భార్య సుసెన్. భర్త వేరే అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని తెలియడం, ఆ తరహా వదంతులను ఎక్కువగా వినడం ఎంతో బాధించింది ఆమెను. హృతిక్ తన చిన్ననాటి స్నేహితుడు కావడంతో సూసేన్ ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెద్దలను కూడా ఎంతో కష్టపడి ఒప్పించింది. అనుకున్నట్లు గానే వారి దాంపత్య జీవితం బాగా నడుస్తుంది అన్నప్పుడు బార్బరీ వల్ల వీరికి విడాకులు రావడం వారి అభిమానులు ఎంతగానో బాధ పెట్టింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తన సినిమాలు తను చేసుకుంటూ ఉన్నాడు.

Related Articles

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu
Top