Dailyhunt
ఆ నటి కోసం కన్నీరు కార్చిన పరుచూరి.. ఎందుకో తెలుసా.?

ఆ నటి కోసం కన్నీరు కార్చిన పరుచూరి.. ఎందుకో తెలుసా.?

Pakka Filmy 4 years ago

తెలుగు సీనియర్ నటి రమాప్రభ అందరికీ సుపరిచితమే. ఆ తరం నటుల నుండి ఈ తరం నటుల వరకూ అందరితో కలిసి నటించింది. అయితే గతకొద్దికాలంగా ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది ఈమె టాలీవుడ్ లో అగ్ర హాస్యనటి మణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ఎంతోమంది సరసన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే హాస్య నటిగా నటించింది. పాత్ర ఏదైనా కూడా ఆ పాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేయగల నటి. రమాప్రభ అంటే హాస్యనటిగా, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఇలాంటి రమాప్రభ కోసం ప్రముఖ రచయిత అయినా పరుచూరి కన్నీళ్లు పెట్టుకునే వారట. అంత మంచి నటి నటనకు దూరం కావడంతో పరుచూరి గోపాలకృష్ణ బాధపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

అయితే పరుచూరి బ్రదర్స్ రమాప్రభ ను ఎంచుకోవడానికి కారణం రమాప్రభ ఇప్పటివరకు దాదాపుగా 1000 కి పైగా సినిమాలలో నటించింది.

అంతెందుకు ఆమె తమ్ముడు గా భావించే దివంగత నటుడు అయిన రాజు బాబు తో కలిసి దాదాపు 300 చిత్రాలలో నటించింది. సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక అదే తరహాలో అన్నపూర్ణమ్మ, నిర్మలమ్మ ఎలా చేసేవారు అదేవిధంగా రమాప్రభ కూడా చేసేది అంటూ పరుచూరి చెప్పుకొచ్చారు. రమాప్రభ నటించిన కథానాయకుడు సినిమాలో ఒక సన్నివేశంలో ఈమె తన చంకలో చంటి పిల్లాడిని పెట్టుకొని వచ్చే పాత్ర ఆ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అలాగే రేపటి రాజ్యం సినిమాలో రమాప్రభ విలన్ గా నటించింది. అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఒక రోజు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక ఆర్టిస్ట్ చాలా ఆలస్యంగా రావడంతో తనని రమాప్రభ ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని అడగగా ఆమె చెప్పకూడని మాట ఒకటి చెప్పడంతో తనకు కళ్లలో నీళ్లు వచ్చాయట. ఇండస్ట్రీలో ఇద్దరు వ్యక్తులు కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వారి మధ్య ఏదో నడుస్తోంది అన్నట్లు రూమర్స్ వస్తూనే ఉంటాయి అని రమాప్రభ పరుచూరు తెలిపిందట. రాజబాబు, రమాప్రభ ఇద్దరూ కలిసి నటించారు అంటే ఆ సినిమా ఎంతో కామెడీ గా సాగిపోతుంది.ఆమె ప్రస్తుతం ఇక్కడ లేకుండా తమ సొంత ఊరిలో ఉన్నారు అని తెలిసినప్పుడు తనకు చాలా బాధ వేసింది అంటూ చెప్పుకొచ్చారు పరుచూరి. రమాప్రభ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే పరుచూరి ఇల్లు ఉందని తెలిపారు. అంతేకాకుండా శరత్ బాబు, రమాప్రభ విడిపోవడం కూడా ఒక చేదు జ్ఞాపకంగా భావిస్తున్నానని తెలిపాడు.

Related Articles

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu