Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఐడి కార్డుతో ఎన్టీఆర్..వైరల్ అవుతున్న పోస్టర్..

ఐడి కార్డుతో ఎన్టీఆర్..వైరల్ అవుతున్న పోస్టర్..

Pakka Filmy 5 years ago

ఏంటి సరికొత్తగా ఎన్టీఆర్ ఐడీ కార్డు తోనా..? తన స్కూల్ ఫోటో అయి ఉండవచ్చని కొంత మంది అనుకుంటుండగా, మరికొంతమంది .. లేదు.. కాలేజీలో చదువుతున్నప్పుడు ఐడి కార్డు ఇచ్చి ఉంటారు.. అని మరికొంత మంది అనుకుంటారు. కానీ మీరు అనుకున్నది నిజం కాదు.. ఎందుకంటే ఐడి కార్డు తో ఎన్టీఆర్ సినిమా సెట్లో కనిపించడం విశేషం. ఇప్పటివరకు మనం ఏదైనా సంస్థలలోనూ, ఇతర ప్రభుత్వ రంగాలలో అలాగే ప్రైవేట్ రంగాలలో, పాఠశాలలు, కళాశాలలో మాత్రమే చేరినప్పుడు మనకంటూ ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది.

కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా సినీ ఇండస్ట్రీలో కూడా ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతోంది.

సినీ ఇండస్ట్రీలో కూడా తమ వృత్తిని బట్టి , స్థాయిని బట్టి ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక సినిమా సెట్లో.. ఇలా ఐడి కార్డు ఇవ్వడం ప్రస్తుతం వైరల్ గా మారింది..ఇంతకూ ఎన్టీఆర్ వేసుకున్న ఐడి కార్డు ఏ సినిమా సెట్లోది..దాని పూర్తి వివరాలు ఏంటో..? ఇప్పుడు తెలుసుకుందాం..

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో కలసి నిర్మిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీ గా రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా సరికొత్తగా ఐడి కార్డును మెడలో వేసుకొని ఉండగా, రాజమౌళి తన ఐడి కార్డ్ ను చేతిలో పట్టుకొని చూపిస్తూ, ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది. ఇది కాస్తా వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ తన ఫేస్ బుక్ ఖాతా నుండి కూడా, తన ఐడి కార్డు తో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం జరిగింది. ఆ ఫోటో కింద..' మొట్టమొదటిసారిగా సెట్ లో నేను ఐడి కార్డ్ వేసుకున్నాను..' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇది చూసిన ఆయన అభిమానులంతా సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఐడి కార్డు వేసుకున్నారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu