Friday, 23 Apr, 4.25 pm Pakka Filmy

హోమ్
అమెజాన్ ప్రైమ్ లో కి వకీల్ సాబ్.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్ల ఇతర ముఖ్య పాత్రలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ సినిమా హిందీ బ్లాక్ బస్టర్ పింక్ సినిమాకు రీమేక్‌గా వచ్చింది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతోంది. వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాలలో 1200 వరకు థియేటర్స్ లో విడుదలై భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో మంచి అంచనాలున్నాయి.

దీనికితోడు టీజర్ అండ్ ట్రైలర్‌తో మంచి హైప్‌ను క్రియేట్ చేసింది చిత్రబృందం. ఇక టికెట్ హైక్స్ భారీ గా పెంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగా రికార్డ్ లెవల్ బుకింగ్స్ జరిగాయి. అయితే సడెన్ గా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ హైక్స్ తగ్గించడంతో బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలు చాలా ప్రాంతాల్లో పడలేదు.అయినా కూడా ఈ చిత్రం కరోనా టైమ్ లో కలెక్షన్ కుమ్మేసింది.ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఆటోమేటిక్‌గా ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా ఈ రేంజ్‌లో వసూళ్లు అంటే మాటలు కాదు.

ఈ సినిమా మొదటి వారం లోనే మంచి కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా మొదటి మూడు రోజులు అదిరిపోయే కలెక్షన్స్‌ వచ్చాయి. ఇక ఆ తర్వాత పెద్దగా రాబట్టలేకపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటకు రావాడానికి బయపడుతున్నారు. అయితే ఇప్పటికే థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని సినిమాలు ఓటీటీ లోకి కూడా వచ్చేసాయి. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా ఓటీటీ బాట పట్టనుందని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చేనెల మే 7 నుంచి ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కు వస్తుందని టాక్ మొదలైంది. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో థియేటర్ లో సినిమా చూసే వారి సంఖ్య తగ్గిపోయింది.

వకీల్ సాబ్ సినిమాలో థమన్ సంగీతం అందించగా ఇందులో అనన్య నాగల్ల, నివేతా థామస్ , అంజలి కీలక పాత్ర నటించారు. ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా ఓ చిన్న పాత్రలో మెరిసింది. అయితే వకీల్ సాబ్ సినిమా వల్ల హీరో మరియు నిర్మాత ఇద్దరూ భారీగా లాభం పొందారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. తిన్న తర్వాత మరో 15 కోట్లు లాభాల్లో వాటా గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాలు 150 కోట్ల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఖర్చులన్నీ పోగా దిల్ రాజు 50 కోట్ల వరకు లాభాన్ని పొందాడని అంటున్నారు. శృతిహాసన్ మరియు నివేదా థామస్ కు 75 లక్షలు, అంజలికి 50 లక్షలు ప్రకాష్ రాజ్ కు కోటి రూపాయలు, అలాగే అనన్య కు 30 లక్షలు వరకు పారితోషికం ఇచ్చినట్లు సోషల్ మీడియా లో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu
Top