Dailyhunt
భవిష్యత్ హీరోలు.. ఇప్పటినుంచే ఫుల్ బిజీ గా ఉన్నారే..!!

భవిష్యత్ హీరోలు.. ఇప్పటినుంచే ఫుల్ బిజీ గా ఉన్నారే..!!

Pakka Filmy 4 years ago

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వారసులు రావడం కొత్తేమి కాదు. గత మూడు తరాలుగా సినిమా ఇండస్ట్రీని వారసులు మాత్రమే ఏలుతున్నారు. ఎక్కడో ఒకరిద్దరు మాత్రమే కొత్త వారు వచ్చి హీరోలు వా నిలదొక్కుకున్నారు. నందమూరి వంశం నుంచి మెగాస్టార్ వంశం నుంచి, అక్కినేని వంశం నుంచి, దగ్గుబాటి వంశం నుంచి ఇలా చాలామంది వంశాల నుంచి మంచి మంచి నటీనటులు వచ్చి స్టార్ హీరోలు గా తమ తమ టాలెంట్ ను నిరూపించుకుని హీరోలు గా నిలదొక్కుకున్నారు.

ఆ విధంగా గా ఇప్పుడు యంగ్ హీరోగా ఉన్నవారు కూడా వారసులు గా సినిమా పరిశ్రమలోకి వస్తుండడం విశేషం.

ఎన్టీఆర్, అల్లు అర్జున్ వారసులు సినిమాల్లోకి వస్తున్నారు. ఈ విషయం అందరిలో ఎంతో ఆసక్తి పెంచుతుంది. ఎన్టీఆర్ తనయుడు భార్గవ్ రామ్ గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు అలాగే అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇకపోతే పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరా కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇటీవలే ఆయనకు సంబంధించిన కొన్ని వర్క్ ఔట్ ఫోటోలు బయటికి రావడంతో హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని తెలుస్తుంది. దానికంటే ముందు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ లాగా అకీరా నందన్ తండ్రిని గుర్తు చేస్తూ కర్రసాము తో ఊపేశాడు. కర్రను వేగంగా తిప్పుతూ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్ చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల కు పుట్టిన కొడుకే ఈ అకీరానందన్.

Related Articles

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu