రాజకీయం
BREAKING NEWS : పోలింగ్ ముందూ చిచ్చు..!

sonia gandhi not concentrate on t leaders
పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడం వల్ల కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పలువురు సీనియర్ నేతలు.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావుతోపాటు పలువురు నేతలు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రతి రోజు కొన్ని డివిజన్లలో పర్యటిస్తూ.. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సినీయర్ నేత మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. చంపాపేట్, లింబోజుగూడ డివిజన్‌లలో ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి…భాజపా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ మండిపడ్డారు.
కులాల పేరు మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టే పని చేయవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టే మాటలతో శాంతియుత వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి.. ఎమ్మెల్యే సీతక్క ప్రచారం నిర్వహించారు.
related stories
-
గాస్సిప్స్ టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా!
-
తెలంగాణ ఖమ్మం మీద కన్నేసిన బీజేపీ. మాకు పోటీ కాంగ్రెస్ మాత్రమే అంటున్న టీఆర్ఎస్
-
తెలంగాణ తాజావార్తలు తెలంగాణ విద్యాశాఖపై హైకోర్టు అసహనం