కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.18 లక్షలు విలువ చేసే పసిడిని స్వాధీనం చేసుకున్నారు. పవర్ బ్యాంక్ 'స్క్రూ'లు, లగేజ్ బ్యాగ్ స్విచ్ల ఆకారంలో బంగారాన్ని వీరు అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి గుట్టు రట్టు చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.18 లక్షలు విలువ చేసే బంగారాన్ని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పవర్ బ్యాంక్ స్క్రూ, లగేజ్ బ్యాగ్ స్విచ్ల ఆకారంలో బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.

