Thursday, 05 Aug, 6.34 pm Pakka Filmy

హోమ్
చెప్పిన కథలన్నీ రిజెక్ట్ చేసి అద్భుత అవకాశం ఇచ్చిన చిరంజీవి.. ఎవరికంటే?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారేవ్వరు లేరనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ వరుస సినిమాలతో యంగ్ హీరోలతో పోటీగా నిలుస్తూ ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. దాదాపు 150కి పైగా సినిమాలలో నటించి టాలీవుడ్ మెగాస్టార్ గా నిలిచాడు. ఇక ఈయన సినిమాలు అంటే అభిమానులు కూడా ఎదురుచూస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈయన కొన్ని కథలను రిజెక్ట్ చేసి.. మళ్లీ అదే డైరెక్టర్ కు అద్భుత అవకాశం ఇచ్చాడు. ఇంతకు డైరెక్టర్ ఎవరంటే..

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత పూరి జగన్నాథ్. ఎన్నో సినిమాలలో దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా నిలిచాడు. 2000 లో బద్రి సినిమాలో తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా పూరికి మంచి గుర్తింపును అందించింది. ఆ తర్వాత పోకిరి, నేనింతే, ఇడియట్, శివమణి, చిరుత వంటి పలు సినిమాలలో దర్శకత్వం వహించి విజయాన్ని అందుకొని క్రేజీ డైరెక్టర్ గా మారాడు. అలా ఇప్పటివరకు నాగార్జున, రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పలువురు హీరోలతో సినిమా చేశాడు. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.

దాంతో పూరి జగన్నాథ్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న కూడా చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారు అని చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అలా గతంలో కూడా వజ్రోత్సవం వేడుకలో.. స్టార్ హీరోలతో పాటు చిరంజీవి కూడా పాల్గొన్నాడు. ఇక ఆ వేడుకలో పూరి జగన్నాథ్ కి మెగాస్టార్ చిరంజీవి తో సినిమా ఎప్పుడూ ఉంటుందని మళ్లీ ప్రశ్న ఎదురయింది. ఇక చిరంజీవికి అంతకుముందే కొన్ని కథలను వినిపించాడట పూరి. కానీ అవి చిరంజీవికి నచ్చలేదట. దాంతో తన కుమారుడు రామ్ చరణ్ తో పెద్ద బాధ్యతను పెట్టించాడట చిరంజీవి. అదే రామ్ చరణ్ నటించిన తొలి సినిమా 'చిరుత' అని తెలిపాడు. ఇక ఈ సినిమాకు పెద్ద అంచనాలు కూడా రావడంతో ఈ సినిమా తనకు అద్భుతమైన అవకాశమని తెలిపాడు పూరి జగన్నాథ్. ఇక ఇప్పటికి చిరంజీవి అభిమానులు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ఎప్పుడని ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.

Related Articles

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu
Top