Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరంజీవిపై అకారణంగా కోప్పడ్డ భారతీరాజా..చిరంజీవి ఏం చేశారో తెలుసా.?

చిరంజీవిపై అకారణంగా కోప్పడ్డ భారతీరాజా..చిరంజీవి ఏం చేశారో తెలుసా.?

Pakka Filmy 5 years ago

టాలీవుడ్ దర్శకుడు భారతీరాజా విపరీతమైన కోపిష్టి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇతనికి చిన్న చిన్న విషయాలకే తొందరగా కోపం వచ్చేస్తుంటుంది. ఇక ఈ విషయంలో ఆయన దగ్గర పనిచేసే ఆర్టిస్టులకు అలాగే సాంకేతిక నిపుణులకు అందరికీ అతని గురించి బాగా తెలుసు. సినిమా షూటింగ్ సమయంలో పని ఒత్తిడి వల్ల ఏ చిన్న లోపం జరిగినా కూడా భారతీరాజా కు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. అయితే ఆయన తనలోని కోపాన్ని మార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా ఆయన వల్ల కాలేదు. అలా ఒకరోజు ఆరాధనా సినిమా షూటింగ్ నాగర్ కోయిల్ లో మండుటెండలో జరుగుతోంది. ఇక ఆ రోజు కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల భారతీరాజా చాలా చిరాగ్గా కోపంగా ఉన్నారు.

ఇక భారతీరాజా ఆ కోపం లోనే కొంత భాగం ఆరాధన సినిమా హీరో అయిన చిరంజీవిపై కూడా చూపించారు. ఇక చిరంజీవి తెలుగులో అగ్ర కథానాయకుడిగా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఆ సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ చేస్తున్నారు. అయితే ఆ డైరెక్టర్ అకారణంగా తనపై చూపించిన కోపానికి చిరంజీవి ఆయనను పిలిచి ఎందుకు నామీద కోపం అంటావు అని అడగవచ్చు, కానీ చిరంజీవి ఆ రోజు ఆ పరిస్థితుల్లో దర్శకుడిని ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయారు. అంతే కాకుండా కనీసం ఎందుకు కోపంగా ఉన్నారని భారతీరాజా ను కూడా ఆయన అడగలేదు. అలాగే డైరెక్టర్ తనును కోపడ్డారన్న ఫీలింగ్ కూడా చిరంజీవి లో ఎక్కడా కనిపించలేదు .

ఇలా అటువంటి సమయంలో చిరంజీవి ప్రదర్శించే సహనం ఓర్పు వల్లే ఆయనను ఒక మెగాస్టార్ రేంజ్ కి ఎదిగేలా చేశాఏమో. ఈ విషయాన్ని ఒక సందర్భంగా భారతీరాజా స్వయంగా తానే చెప్పుకొచ్చాడు. ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులలో అలాంటి సభ్యత, సంస్కారం, సహనం,ఓర్పు చాలా ఉంటాయి ఆయనే ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ అరుదైన లక్షణాలే చిరంజీవిని చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాయి అనేది నా నమ్మకం అని తెలిపారు. అయితే ఒక్కొక్క హీరోని ఒక్కొక్క విధంగా గౌరవిస్తాం, కానీ నేను చిరంజీవి అభిమాని చేయడానికి గల కారణం ఆయనలో ఉన్న సహృదయత నే అని భారతీరాజా చెప్పుకొచ్చారు.

Related Articles

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu