సాధారణంగా సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం.. అంతేకాదు మాయా ప్రపంచం అని కూడా చెప్పవచ్చు. కొంతమంది తమ లో ఉన్న ప్రతిభను చూపించడానికి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడితే, మరికొంతమంది ఈ మాయా ప్రపంచాన్ని చూడటానికి అడుగు పెడుతూ ఉంటారు.
ఇంకొంత మంది ఆర్థికంగా నష్టపోయి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి డబ్బును, వెనక్కి తీసుకోవాలని చూస్తూ ఉంటే ,కొంతమంది సంపాదించిన డబ్బును నిరుపేదలకు దానంగా ఇస్తూ ఉంటారు.. అలాంటివారిలో ఎప్పటికీ ముందుండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు.. చేసిన సహాయం ఊరికే పోదు అని అన్నట్టుగా.. చిరంజీవి చేసే సహాయం చెప్పకపోయినా నుంచి సహాయం పొందిన ప్రతి ఒక్కరి దీవెనలు చిరంజీవి కుటుంబానికి ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..

సినీ పెద్దలు కూడా సినీ ఇండస్ట్రీలోని కార్మికులకు, ప్రజలకు కూడా తమ వంతు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇక చిరంజీవి ఈ మధ్య కరోనా సమయంలో ఎంతో మందికి , ఎన్నో రకాలుగా సహాయపడినప్పటికీ కొంతమంది చిరంజీవి చేస్తున్న పనికి , అసూయపడి ఆయనపై విమర్శలు గుప్పించారు. ఏం పెద్ద చేస్తున్నాడులే ..? అన్నట్టుగా నిర్లక్ష్యంగా మాట్లాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాం..
ఇప్పుడు చెప్పబోయే ఒక వార్త వింటే మాత్రం ఇలాంటి విమర్శలు గుప్పించే వారందరి నోటికి , తాళం పడినట్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి తను సంపాదించిన మొత్తం లో రోజుకు ఎంత దానం చేస్తున్నారు అనే విషయంపై ఆరా తీయగా, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇక ఆయన ఇంటికి ఎవరైనా ఆర్థిక సహాయం కావాలంటూ వస్తే ,వారికి లక్షా రెండు లక్షలు అని చూడకుండా వారి పరిస్థితిని బట్టి చెక్ రాశి ఇస్తూ ఉంటారట అంతేకాదు ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఆయన చాలామందికి నిత్యావసర సరుకులను పంపిస్తూనే, రోజుకు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు చెక్ రూపంలో ఇస్తున్నట్లు సమాచారం.

Related Articles

