Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
FLASH NEWS : 60మంది డీఎస్పీలకు పోస్టింగ్​లు ఇవ్వకుండా ..!

FLASH NEWS : 60మంది డీఎస్పీలకు పోస్టింగ్​లు ఇవ్వకుండా ..!

Pakka Filmy 5 years ago

రాష్ట్రంలోని అన్ని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో జగన్ సొంత సామాజిక వర్గంవారినే వైస్ ఛాన్సలర్లుగా నియమించుకున్నారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో వీసీల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగితే… జగన్ మాత్రం రెడ్డి సామాజికవర్గం వారినే నియమించారని విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్ కులపిచ్చితో తనవర్గానికి న్యాయంచేసుకుంటూ మిగిలినవర్గాలపై ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతున్నారని ఆరోపించారు. ఆ అక్కుసుతోనే కమ్మ సామాజికవర్గానికి చెందిన 60మంది డీఎస్పీలకు పోస్టింగ్​లు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు.

టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ…విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకంలో సామాజిక న్యాయం లోపించిందని విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu