Dailyhunt

FLASH NEWS : అల్లు అర్జున్ సినిమాలో తొమ్మిది మంది విలన్స్..?

Pakka Filmy 5 years ago

పుష్ప'లో హీరో తెలుసు, హీరోయిన్‌ తెలుసు.. విలన్‌ సంగతే తెలియదు.ఈ పాత్ర కోసం బాబీ సింహా, విజయ్‌ సేతుపతి.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలాయి. ఇప్పుడు ఈ జాబితాలో మరో పేరు కూడా వినిపిస్తోంది. అంతే కాదు విలన్ల సంఖ్య మీద కూడా కొత్త మాట చక్కర్లు కొడుతోంది.

'పుష్ప'రాజ్‌ను ఢీకొట్టడానికి కొత్త విలన్‌ను తీసుకుంటారని తెలుస్తోంది.

'డిస్కోరాజా', 'కలర్‌ఫొటో'తో తనలోని విలనిజం చూపించిన సునీల్‌ 'పుష్ప'కి విలన్‌ అవుతాడని అంటున్నారు. మరోవైపు 'చియాన్‌' విక్రమ్‌ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు.

అయితే.. ఈ సినిమాలో ఇప్పుడు తొమ్మిది మంది విలన్లు ఉంటారని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. టాలీవుడ్‌లో అయితే హాట్ టాపిక్‌గా మారింది. పాత కాలం సినిమాల్లోలాగా 'పుష్ప'లో ఎక్కువమంది విలన్లను సుకుమార్‌ పెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి బేసిక్‌ వర్క్‌ కూడా పూర్తయిందట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu