హోమ్
FLASH NEWS : అమీర్ ఖాన్ కూతురు ప్రేమ పెళ్లి..!

ప్రముఖ మల్లయోధులు బజ్రంగ్ పునియా, సంగీత ఫొగాట్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇరువురి కుటుంబాల సమక్షంలో బుధవారం వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు వధూవరులు.
You Complete Me ❤️ Soulmate for life. A New chapter of Life Would be Full Of love and Happiness. #SangRang @BajrangPunia ❤️ pic.twitter.com/dFIgSPNh6Q
— Sangeeta Phogat (@sangeeta_phogat) November 26, 2020
మహావీర్ సింగ్ ఫొగాట్ చిన్న కుమార్తె అయిన సంగీత.. బజ్‌రంగ్‌ను తొలిసారి మూడేళ్ల క్రితం జాతీయ శిక్షణ శిబిరంలో కలిసింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఫొగాట్ సిస్టర్స్ (గీత, బబిత, ప్రియాంక, రితు, వినేశ్)లో చిన్నదైన 22 ఏళ్ల సంగీత తన అక్కల బాటలోనే నడుస్తూ రెజ్లింగ్‌లో రాణిస్తోంది.
గీత, సంగీతలను అంతర్జాతీయ స్థాయిలో మల్లయోధులుగా తీర్చిదిద్దిన వారి తండ్రి మహావీర్‌సింగ్ జీవితం ఆధారంగానే అమీర్‌ఖాన్ ముఖ్యపాత్ర పోషించిన 'దంగల్' సినిమా తెరకెక్కింది.
related stories
-
క్రీడలు పవన్ తోనే కెరీర్ ఆరంభ, పునఃప్రారంభ చిత్రాలు
-
సినిమా బాల్య మిత్రుడి కోసం
-
జాతీయం-అంతర్జాతీయం ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన మన కశ్మీర్లో..