ghmc elections notification release
గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల కోడ్ నుంచి ఇప్పటివరకు 87 వేల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించినట్లు గ్రేటర్ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్ అధికారి విశ్వజిత్ తెలిపారు. ఇందులో 12,500 బ్యానర్లు, 16,040 పోస్టర్లు, 4,231 బోర్డులు, 16,977 ఫ్లెక్సీలు, 37,650 జెండాలు తొలగించారు.
ఇవాళ ఒక్కరోజే 485 బ్యానర్లు, 2,844 పోస్టర్లు, 71 బోర్డులు, 1,300 ఫ్లెక్సీలు, 3,983 జెండాలను తొలగించామన్నారు. నగరంలో అనుమతి లేకుండా వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు.
ఇవాళ తొలగించిన ప్లెక్సీలు, బ్యానర్లలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రహరీలు, ప్రధాన రహదారుల్లో ఉన్నాయి.

