Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
FLASH NEWS : కూల్చివేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా..!

FLASH NEWS : కూల్చివేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా..!

Pakka Filmy 5 years ago

పీవీ, ఎన్టీఆర్​ ఘాట్లను కూల్చివేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా అని బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. నాలుగు ఓట్ల కోసం బీజేపి నాటకాలాడుతోందని మండిపడ్డారు.

కొవిడ్ వ్యాక్సిన్ నగరంలో తయారుకావడం గర్వకారణమని మంత్రి తలసాని అన్నారు. ఎన్డీఏ సర్కార్.. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ప్రకటిస్తోందని చెప్పారు. జీహెచ్​ఎంసీలో ఎప్పుడైనా భాజపా అధికారంలో ఉందా అని ప్రశ్నించారు. పరిపాలన అనుభవం లేని వారు మేనిఫెస్టో విడుదల చేశారని ఎద్దేవా చేశారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాగంగా శనివారం రోజున ఎల్బీ స్టేడియంలో జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలంతా సాయంత్రం 4 గంటలకే హాజరవ్వాలని కోరారు.

నాయకులు, కార్యకర్తలంతా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu