Dailyhunt
పాపం.. రమ్య కృష్ణకు చుక్కలు చూపించిన భర్త.. ఏం జరిగిందంటే?

పాపం.. రమ్య కృష్ణకు చుక్కలు చూపించిన భర్త.. ఏం జరిగిందంటే?

Pakka Filmy 4 years ago

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి స్టార్ నటి రమ్యకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించిన ఈమె తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హోదాను సంపాదించుకుంది.

తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ళ మనసులను దోచుకుంది. ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. లేటు వయసులో కూడా తన అందంలో ఎలాంటి మార్పులు లేవు. ఇదిలా ఉంటే తాజాగా రమ్యకృష్ణ కు తన భర్త చుక్కలు చూపించాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

 ఇంతకీ రమ్యకృష్ణ భర్త ఎవరో అందరికి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా నిలిచిన కృష్ణవంశీనే రమ్యకృష్ణ భర్త. ఇక వీరికి రిత్విక్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే కృష్ణవంశీ తన దర్శకత్వంలో చాలా సినిమాలను తీశాడు. రమ్యకృష్ణ నటించిన చంద్రలేఖ సినిమాకు కృష్ణ వంశీ దర్శకత్వం వహించగా ఆ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి పెళ్లి వరకు తీసుకొచ్చింది.

ఇదిలా ఉంటే కృష్ణవంశీ దర్శకత్వంలో గతంలో నక్షత్రం అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో కొన్ని విషయాలు పంచుకున్నాడు కృష్ణవంశీ. ఇందులో యాంకర్.. కృష్ణవంశీని మీరు పనిచేసిన ఏ స్టార్ నటులైనా మీకు చుక్కలు చూపించారా అని ప్రశ్నించడంతో.. చాలామంది నటులకి నేనే చుక్కలు చూపించాను అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అంతేకాకుండా రమ్యకృష్ణ కూడా చాలా చుక్కలు చూపించాను అని అనేసరికి వెంటనే యాంకర్ పాపం అంటూ బదులిచ్చింది. ఇక తన లైఫ్ లో నక్షత్రం తన కొడుకు అని అనడంతో మరికొందరు రమ్యకృష్ణ పేరును వినిపించారు. ఇక రమ్యకృష్ణ నక్షత్రం కాదు అంటూ ఆకాశమని తన గురించి అద్భుతంగా వివరించాడు కృష్ణ వంశీ.

Related Articles

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu