Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
PK : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉప ఎన్నికలో ప్రత్యక్ష పోరుకు దిగుతున్నారుగా!!

PK : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉప ఎన్నికలో ప్రత్యక్ష పోరుకు దిగుతున్నారుగా!!

Pakka Filmy 1 week ago

ప్రశాంత్ కిషోర్ (PK) ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపుతెచ్చుకున్నారు. ఇప్పుడు బిహార్ లోని బంకీపుర అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ప్రత్యక్ష పోరుకు దిగుతున్నారు.

ఈ నెల 30న జరిగే ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బిహార్ లో జన్ సురాజ్ పార్టీ స్థాపించిన పీకే, గతంలో వైసీపీతో సహా పలు పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మౌనదీక్ష చేపట్టి, బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై నిశిత విమర్శలు చేస్తూ ప్రజల్లో తన popularity ని పెంచుకున్నారు.

బంకీపుర నియోజకవర్గం ఖాళీ అవడానికి కారణం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేయడం. నబీన్ ను రాజ్యసభకు ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఈ స్థానం ఖాళీ అయింది. ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా మారింది. వరుస విజయాలతో అక్కడ బీజేపీ బలమైన పార్టీగా ఉంది. ఇలాంటి స్థానంలో పీకే పోటీకి నిలవడం గమనార్హం. అయితే ఇతర పార్టీలను ఒప్పించి ప్రతిపక్షాల తరుఫున అభ్యర్థిగా నిలబడే ప్రయత్నాలు చేస్తానని పీకే చెప్పడం కూడా గమనించతగ్గ విషయం.

గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. 243 స్థానాల్లో 238 లో అభ్యర్థులను నిలబెట్టినా ఒక్క సీటు కూడా రాలేదు. పీకే ప్రచారానికి ప్రజలు భారీగా తరలివచ్చినా ఓట్ల రూపంలో మాత్రం మద్దతు లభించలేదు. ఈ నేపథ్యంలో పీకే మౌనదీక్షకు దిగి, మళ్లీ ప్రజల్లోకి వెళ్లి తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఉప ఎన్నికలో ప్రత్యక్ష పోరుకు దిగడం ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ ఎన్నికలో పీకే కాంగ్రెస్ వంటి పార్టీలను ఒప్పించి సంయుక్త అభ్యర్థిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఓకే చెప్పిందా లేదా అనేది చూడాల్సి ఉంది. బంకీపుర నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉండటంతో, పీకే కోసం ఇది పెద్ద సవాలే అవుతుంది. ప్రస్తుతం పీకే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఫలితం ఏమిటో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu