Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Prasna Ravan: భర్తపై కల్పిత వీడియోతో ప్రచారం - భార్య అనూష ఖండన

Prasna Ravan: భర్తపై కల్పిత వీడియోతో ప్రచారం - భార్య అనూష ఖండన

Pakka Filmy 3 months ago

ప్రశ్న రావణ్ వివాదంలో భర్తపై కల్పిత వీడియోతో జరుగుతున్న ప్రచారాన్ని భార్య అనూష తీవ్రంగా ఖండించింది. యూట్యూబర్ రావణ్ సృష్టించిన ఆ వీడియో వాస్తవం కాదని, అది తప్పుడు ప్రచారం కోసం తయారు చేసినదని ఆమె పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ తప్పుడు వ్యాప్తిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.

కొన్ని మీడియా సంస్థలు రావణ్ కులాన్ని వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నాయని అనూష ఆవేదన వ్యక్తం చేశారు. కులాలు, మతాల పేరుతో విద్వేషాలను తమ కుటుంబం తిరస్కరిస్తుందని, అయినా వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత నెరవేర్చడానికి తన భర్త కమ్మ కులానికి చెందినవారని వెల్లడించారు. అలాగే, రావణ్ పేరు అధికారికంగా నమోదు చేయబడిందని తెలిపారు.

ప్రజాస్వామ్యవాదిగా రావణ్ గట్టిగా ప్రశ్నించడం తన స్వభావమని, అది ఎవ్వరినీ కించపరచాలని కాదని అనూష స్పష్టం చేశారు. బాధ్యత కలిగిన వారు సమాధానాలు ఇవ్వాలి లేదా లోపాలను సరిదిద్దుకోవాలి తప్ప, చట్టవ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి దారుణ ఘటనల నుండి దృష్టి మరల్చేందుకు రావణ్ను వేధిస్తున్నారని ఆరోపించారు.

చివరగా, న్యాయం ఆలస్యమైనా తప్పక జరుగుతుందనే విశ్వాసంతో తాము కోర్టులపై నమ్మకం ఉంచామని ప్రశ్న రావణ్ కుటుంబం తరపున అనూష ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజాస్వామ్యవాదులంతా రావణ్కు అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో నిజాయితీ తమకు ఉందని స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu