Dailyhunt
రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన జానపద చిత్రం.

రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన జానపద చిత్రం.

Pakka Filmy 4 years ago

ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సినీ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న సమయంలో.. ప్రేక్షకులు పౌరాణిక చిత్రాలకు ఎంతో విలువ ఇచ్చేవారో, అంతేకాదు జానపద చిత్రాలకు కూడా అంతే విలువ నిచ్చేవారు. ఇక్కడ ముఖ్యంగా 1951 వ సంవత్సరంలో ఎన్టీ రామారావు నటించిన పాతాళభైరవి చిత్రం ప్రత్యేకమైనది. పింగళి నాగేంద్రరావు మాటలు ఇవ్వగా, బి.నాగిరెడ్డి ఈ జానపద చిత్రాన్ని నిర్మించారు. ఇక భవిష్యత్తులో ఎన్నో జానపద చిత్రాలు రావడానికి ఈ సినిమా ఒక మూలాధారం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో కాంతారావు , ఎన్టీరామారావు కలిసి నటించారు. ఇక ఎన్టీఆర్ తోనే దర్శకధీరుడు రాఘవేంద్రరావు మరొక జానపద చిత్రాన్ని తీయడం జరిగింది. ఇక రాఘవేంద్ర సినీ జీవితంలో అదే మొదటి చివరి జానపద చిత్రం.

 ఎన్టీఆర్ 1977వ సంవత్సరంలో తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన దాన వీర శూర కర్ణ సినిమా తర్వాత 1978 సంవత్సరంలో తిరుపతి ప్రొడక్షన్స్ వారి ఆధ్వర్యంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సింహబలుడు.ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోగా, వాణిశ్రీ హీరోయిన్ గా నటించారు.. ఇక ఇదే సమయంలో గిరిబాబు నిర్మాతగా , కొమ్మినేని దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా , లతా హీరోయిన్లుగా ఇంకో జానపద చిత్రం షూటింగ్ జరుపుకోవడం విశేషం.. అదే సింహగర్జన.

ఇక దాన వీర శూర కర్ణ సినిమా కు పోటీగా వచ్చిన కృష్ణ, ఈ సారి జానపద చిత్రాన్ని కూడా సింహగర్జన సినిమాతో పోటీ గా నిలవడం మరో విశేషం.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే , ఈ రెండు జానపద చిత్రాలు కూడా వారి సొంత బ్యానర్లో నిర్మించకపోవడమే. అంతేకాదు అప్పటికే వాణిశ్రీ సింహబలుడు చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సింహ గర్జన సినిమాకు కూడా గిరిబాబు హీరోయిన్ గా నటించమని వాణిశ్రీ కి చెప్పడంతో, ఆమె ఇప్పటికే ఒక జానపద చిత్రంలో నటిస్తున్నాను ..మరొక జానపద చిత్రంలో నటించడానికి ..నాకు వీలు కాదు ..అని చెప్పడంతో గిరిబాబు లత ను తీసుకొచ్చి హీరోయిన్ గా పెట్టడం జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా దాదాపు 15 రోజుల వ్యవధిలో 1978 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

Related Articles

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu