
సినీ ఇండస్ట్రీలో ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఒక సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించాడు. ఇక అంతే కాకుండా ఈయనను గాన గాంధర్వుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక కరోనా సమయంలో దాదాపు 40 రోజుల పాటు కరోనాతో పోరాడి మరణించాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అయితే ఇప్పుడు ఈయన ఆస్తుల గురించి కొన్ని వార్తలు వైరల్ గా మారుతున్నాయి. అవి ఏంటో చూద్దాం.
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించి సంవత్సరం కూడా కాకనే తన ఆస్తులను అమ్మేస్తున్నారు అంటూ… వచ్చిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.
ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు కొన్ని సినిమాలను నిర్మించిన యెడల దాని నుండి నష్టం వచ్చిందనే కారణంగా తన తండ్రి ఆస్తులను అమ్మేస్తున్న ట్లు వార్త రావడం జరిగింది.

అయితే ఈ వార్తపై తాజాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ స్పందించాడు.. ' నేను మా నాన్నగారు సంపాదించిన అటువంటి ఆస్తులను అమ్మడం లేదు, ఆ వార్త కేవలం కల్పితమని స్పష్టం ఇచ్చాడు చరణ్. ఇక అంతే కాకుండా నా వల్ల మా నాన్న గారి పేరు చెడిపోవడం నాకు ఇష్టం లేదు అని తెలియజేశారు.
ఇక అంతే కాకుండా సినిమాల వల్ల నష్టపోయాం అని చెప్పి మా నాన్నగారికి ఎటువంటి బాధ లేదని చెప్పుకొచ్చారు. నా అప్పులను స్వయానా నేనే తీర్చుకుంటాను' అంటూ చెప్పుకొచ్చారు చరణ్. అయితే ఇటీవల కోదండ పాటి స్టూడియోస్ నున్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు తాజాగా అమ్మేసినట్లు సమాచారం. అందుకు గల కారణం ఏమిటంటే , అక్కడ పనిచేసేటువంటి వారికి ఏ పని లేకపోవడంతో దానిని అమ్మేశారని స్పష్టమవుతున్నది. దీని కారణంగానే మా నాన్న ఆస్తులు అమ్మేస్తున్నట్లు ప్రచారం జరిగిందని చెప్పుకొచ్చాడు చరణ్. ఏది ఏమైనా పూర్తిగా తెలుసుకొని ప్రచారం చేస్తే బాగుంటుందని ఎస్ పి చరణ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
Related Articles