Thursday, 05 Aug, 3.16 pm Pakka Filmy

హోమ్
సొంత ఫ్యామిలీ నే చాలా టార్చర్ పెట్టింది.. హృతిక్ రోషన్ అక్క సంచలన ఆరోపణలు..!!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అంటే తెలియని వారు ఉండరు. కోట్లాది మంది ప్రేక్షకులు ఆయనకు అభిమానులు గా ఉన్నారు. అందులో ఎక్కువగా అమ్మాయిలే ఉండటం గమనార్హం. కండలు తిరిగిన బాడీ తో ప్రేక్షక లోకాన్ని తన సినిమాలతో ఎంతగానో అలరించిన హృతిక్ రోషన్ విషయాలు సినిమాల పరంగా అందరికీ తెలిసినవే కానీ పర్సనల్ లైఫ్ లో అనేక విషయాలు అందరికీ తెలియవు. రాకేష్ రోషన్ తనయుడిగా బాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన హృతిక్ రోషన్ తొలి సినిమా మా తోనే కహోనా ప్యార్ హై అంటూ సూపర్ హిట్ అందుకున్నాడు.

తను నటించిన మొదటి సినిమాతోనే మంచి అవార్డులు కూడా దక్కించుకున్నాడు హృతిక్. ఈ సినిమాతో ఆ తర్వాత మంచి మంచి సినిమా అవకాశాలు పొందాడు. క్రిష్ ధూమ్ సినిమాలు ఆయనకు సూపర్ హీరోగా ఇండియన్ సినిమాలలో మంచి పేరు తీసుకు రాగా ఆయనకు ఎన్నో సినిమాలు ఫ్యామిలీ ఇమేజ్ ను యాక్షన్ హీరో ఇమేజ్ ను కూడా తీసుకు వచ్చాయి. ఇక హృతిక్ సోదరి సునయన రోషన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు.

ఆమె ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమించారని కుటుంబ సభ్యులే ఆమెకు వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా ఈ మధ్య గత కొంతకాలంగా ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. సొంత తమ్ముడు హృతిక్ కూడా తనకు సాయపడడం లేదని తనపై ద్వేషం పెంచుకుంటున్నాడు అని ఆమె కామెంట్ చేసింది. మా కుటుంబ సభ్యుల మధ్య అందమైన అనుబంధం ఉండేది. కుటుంబ సభ్యుల నుంచి స్నేహితులు వరకు అందరికీ ప్రేమ పంచుతూ ఉంటాము. కాస్త ఆలోచించగలిగే శక్తి ఉంటే ఎలాంటి విషయమైనా అర్థం చేసుకోగలుగుతారు.అని హృతిక్ రోషన్ తన సోదరి ప్రేమ వ్యవహారం గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రేమించే వ్యక్తి పై ఎప్పటికీ ద్వేషం రాదు అలా వస్తే అసలు అది ప్రేమే కాదు అని చెప్పారు.

Related Articles

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu
Top