Dailyhunt
టాలీవుడ్ లో మొట్టమొదటి రీమేక్ చిత్రం..

టాలీవుడ్ లో మొట్టమొదటి రీమేక్ చిత్రం..

Pakka Filmy 4 years ago

సాధారణంగా ఏదైనా ఒక సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి విజయాన్ని అందుకుంటే , ఆ సినిమాను రైట్స్ ను దక్కించుకోవడం కోసం ఇతర సినిమా నిర్మాతలు క్యూ కడుతుంటారు. ఇటీవల కాలంలో ఎక్కువగా మన స్టార్ హీరోలు కూడా రీమేక్ చిత్రాలనే చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,విక్టరీ వెంకటేష్ కూడా ఎక్కువగా రీమేక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇకపోతే ఈ డబ్బింగ్ చిత్రాల హవా ఈనాటిది కాదు.. 1950వ సంవత్సరం నాటిది అని చెప్పవచ్చు. ఇక పూర్తి వివరాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

మొట్టమొదటిసారిగా 1931 వ సంవత్సరంలో సినిమా అనేది మొదలైంది.

అయితే ఈ సినిమా మొదలైనప్పుడు మూకీ డ్రామా గా తెరకెక్కించారు. అలా మొదట్లో మూకీ డ్రామాగా తెరకెక్కిన చిత్రం టాకీ గా మారి ఎన్నో విభిన్న కథలతో, నేపథ్యాలతో పరిచయం అయింది. అంతేకాదు అప్పటినుంచి ప్రేక్షకులను అలరిస్తూ, సరికొత్త టెక్నాలజీలను కూడా ప్రేక్షకులకు చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. మొట్టమొదటిసారిగా 1950 సంవత్సరం నుంచి తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా మొదలైంది. మొట్ట మొదటి సారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలీవుడ్ సినిమాలు రీమేక్ చేయడం జరిగింది. 1946 జనవరి ఒకటవ తేదీన బాలీవుడ్ లో విడుదలైన 'నీరా ఔరా నందా ' సినిమాకు అనువాదంగా 1950వ సంవత్సరం జూన్ 22వ తేదీన 'ఆహుతి' సినిమా రీమేక్ చేయడం జరిగింది.


ఇక ఇలా బాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో ఆర్ ఎస్ జున్నాకర్ దర్శకత్వం వహించారు. ఇందులో జయసింహ , రూప్ బసంత్, శశి, నిశి బరన్ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ సినిమాతోనే మహాకవి శ్రీశ్రీ కూడా వెండి తెరకు పరిచయం కావడం జరిగింది. అప్పట్లో కులవివక్షత చాలానే ఉండేది. ఇక అందుకు తగ్గట్టుగానే సంఘ సంక్షేమానికి బలైన ప్రేమికులకు ఆదర్శంగా తీసుకొని, తెలుగు వారికి ఈ సినిమా అందించింది నవీన ఫిల్మ్స్ అనేవ్నిర్మాణ సంస్థ. అయితే మొదటి ప్రయత్నంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు చిత్ర సభ్యులు.

ఇంక అలా తర్వాత తమిళం, మలయాళం, కన్నడ వంటి సినీ పరిశ్రమల నుండి చిత్రాలు వచ్చి తెలుగు లో సందడి చేశాయి.

Related Articles

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu