Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Rains: తెలంగాణకు ఎల్లో అలర్ట్ 5 రోజులు వానలు

Telangana Rains: తెలంగాణకు ఎల్లో అలర్ట్ 5 రోజులు వానలు

Pakka Filmy 1 day ago

Telangana Rains: తెలంగాణలో వెదర్ కండిషన్స్ పూర్తిగా మారిపోయాయి. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈ మేరకు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాకాలం ముగిసినా సరే, అల్పపీడన ప్రభావంతో మళ్లీ వానలు పడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎస్పెషల్లీ సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో సడన్‌గా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

Telangana Rains Yellow Alert For Next 5 Days

వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డేట్స్ , బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఆకాశం మేఘావృతమైంది. కొన్ని ఏరియాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆఫీసుల నుంచి ఇంటికి రిటర్న్ అయ్యే టైమ్‌లో ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో జనాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అడ్వైజ్ చేస్తున్నారు.

కేవలం హైదరాబాద్ సిటీలోనే కాకుండా నల్లగొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాలలో కూడా వర్షాలు పడే సూచనలున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో రైతన్నలు కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడే హార్వెస్టింగ్ స్టేజ్‌కి వచ్చిన పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అలర్ట్ గా ఉండాలని, ఎమర్జెన్సీ అయితేనే బయటకు రావాలని అఫీషియల్స్ కోరుతున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న ఈ అన్ సీజనల్ రెయిన్స్ వల్ల వాతావరణంలో ఒక్కసారిగా చల్లదనం పెరిగింది. టెంపరేచర్స్ భారీగా పడిపోయి ప్రజలకు చలి అనుభవం కలుగుతోంది. మరో ఐదు రోజుల పాటు ఇదే సిట్యుయేషన్ కంటిన్యూ అవుతుందని వెదర్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సో, ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా గొడుగులు లేదా రెయిన్ కోట్లు క్యారీ చేయడం బెటర్. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అఫీషియల్ వెదర్ రిపోర్ట్స్ ఫాలో అవ్వడం చాలా మంచిది.

 ఇంకా చదవండి: Cockroach Gang: కాక్రోచ్ ల అబద్దం బద్ధలు.. అసలు నిజం ఇదే!!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu