తెలుగు ఇండస్ట్రీలో ఫ్లాప్ లేని డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు డైరెక్టర్ రాజమౌళి. అయితే ఆ గుర్తింపు వెనక తన తండ్రి హస్తం ఉందనేది ప్రతిసారి చెబుతూ వస్తుంటాడు రాజమౌళి. ఇక రాజమౌళి తండ్రి కూడా ఎన్నో సినిమాలకు రచయితగా చేశాడు. విజయేంద్రప్రసాద్ దాదాపుగా 33 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీ లోనే ఉన్నాడు. అయితే రాజమౌళి గురించి తన మాటల్లోనే..ఏమన్నాడో తెలుసుకుందాం.
ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ , డైరెక్టర్ సుకుమార్, త్రివిక్రమ్ ల గురించి తన మనసులో మాటని తెలియజేశాడు.
ఇక అదే విధంగా కొడుకు రాజమౌళి గురించి కూడా ఈ విధంగా చెప్పుకొచ్చారు. సుకుమార్, చాలా నెమ్మదిగా సినిమాలు తీస్తారని తెలియజేశారు విజయేంద్రప్రసాద్. త్రివిక్రమ్ ప్రవర్తన అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్.

ఇక అంతే కాకుండా ఆయనతో సినిమా అంటే ఎంజాయ్ చేయవచ్చు అని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం RRR , తలైవి వంటి భారీ మూవీస్ లకు స్టోరీ అందించాడు విజయేంద్రప్రసాద్. ఇక ఇదే తరుణంలో బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి'కరీనాకపూర్ ' కు'సీత'అనే టైటిల్ తో ఒక కథను రాస్తున్నారట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం.. ఆఫ్రికన్ ఫారెస్ట్ వంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన స్టోరీ తో ఒక సినిమా కథను రాస్తున్నట్లు తెలిపాడు.
ఇక వీటితో పాటే 'రంజిత్ సిన్హా' అనే ఒక టీచర్ యొక్క బయోపిక్ గురించి కూడా రాస్తున్నట్లు చెప్పుకు వచ్చాడు విజయేంద్ర. ఇక అంతే కాకుండా రాజమౌళిని కూడా చాలా స్లోగా సినిమాలు తీస్తాడని.. చెప్పుకొచ్చాడు. ఇక పూరి జగన్నాథ్ అంటే తనకి చాలా ఇష్టమని పలుమార్లు చెప్పుకొచ్చారు ఈయన. అందుచేతనే తన ఫోటోను తన మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకున్నట్లు ఒకానొక సమయంలో ఆయన స్వయంగా తెలియజేశారు. పూరి జగన్నాథ్ లో ఉన్న టాలెంట్ మరే డైరెక్టర్లకు లేదని కూడా చెప్పుకొచ్చాడు.
Related Articles

