Monday, 14 Jun, 6.01 pm Pakka Filmy

హోమ్
తొలిప్రేమ, అన్నమయ్యకు మధ్య పోలిక ఏంటో తెలుసా.. ?

సినిమా పరిశ్రమ అన్నాక ఆయా సినిమాల మధ్య కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. అయితే పూర్తిగా డిఫరెంట్ మూవీస్ అయిన తొలిప్రేమ, అన్నమయ్యకు మధ్య సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? నిజానికి తొలిప్రేమ రొమాంటిక్ మూవీ.. అన్నమయ్య డివోషనల్ సినిమా. అయితే ఈ రెండింటికి మధ్య ఓ కామన్ పాయింట్ మాత్రం ఉంది. అదేంటంటే.. ఈ రెండు సినిమాలు విడుదల అయ్యాక ముందు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. కానీ.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాయి. చివరకు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి ఈ రెండు సినిమాలు. అయితే ముందు నెగెటివ్ టాక్ తెచ్చుకుని.. తర్వాత ఎలా సెన్సేషనల్ హిట్ సాధించాయి అనేది తెలియాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే..

తొలి ప్రేమ సినిమా బేసిగ్గా రొమాంటిక్ లవ్ స్టోరీ. కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వపన్ కల్యాణ్, కీర్తి రెడ్డి హీరో, హీరోయిన్లుగా చేవారు. సినిమా ఆద్యంతం వన్ సైడ్ లవ్ గా ముందుకు సాగుతుంది. భగ్న ప్రేమికుడి పాత్రలో పవన్ బాధను జనాలు చూడలేకపోతారు. ఈ అంశం జనాలకు అంతగా నచ్చదు. ఆ తర్వాత యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. నెమ్మదిగా ఫ్లాప్ టాక్ నుంచి సక్సెస్ టాక్ వైపు దూసుకెళ్లింది ఈ సినిమా. ఆ తర్వాత బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. అటు అన్నమయ్య సినిమా విజయంలో కూడా పలు అంశాలు ప్రభావింతం చేశాయి. మొదటి నుంచి భక్తి సినిమాగానే తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జునకు మీసాలు ఉండటం ఏంటని విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. ఈ సినిమాలో మోహన్ బాబు, రోజా మధ్య రొమాంటిక్ సీన్లు పెట్టడం కూడా విమర్శల పాలైంది. అటు భక్తి సినిమా కావడంతో యువత అంతగా పట్టించుకోలేదు. కానీ ఈ సినిమా పాటలు ఆకట్టుకోవడంతో థియేటర్లకు జనాల తాకిడి పెరిగింది. నెమ్మదిగా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇచ్చాయి.

మొత్తాం ఈ రెండు సినిమాలు నెగెటివ్ టాక్ ను తట్టుకుని.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఫ్లాప్ అవుతాయనుకున్న సినిమాలు కాస్తా సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Pakka Filmy Telugu
Top