Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆన్ లైన్ మోసాలపై కస్టమర్లకు SBI హెచ్చరిక..

ఆన్ లైన్ మోసాలపై కస్టమర్లకు SBI హెచ్చరిక..

ఆన్ లైన్ మోసాలపై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన కస్టమర్లను మరోసారి అప్రమత్తం చేసింది. ఖాతాదారులు మోగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఆన్‌లైన్‌లో ఎటువంటి సున్నితమైన వివరాలను ఎవ్వరితోను పంచుకోవద్దని హెచ్చరించింది. నెట్‌బ్యాంకింగ్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, డేటాప్‌బర్త్‌ వివరాలు, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ నేమ్‌ గానీ, పాస్‌వర్డ్‌, ఏటీఎం నెంబర్‌, బ్యాంకు అకౌంట్‌, ఏటీఎం కార్డు పిన్‌ నెంబర్‌, సీవీవీ, ఓటీపీలు ఇతరులకు చెప్పవద్దని, లేకపోతే నిలువునా మోసపోవాల్సి ఉంటుందని ఎస్‌బీఐ హెచ్చరికలు జారీ చేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. అలాగే ఎవరైనా ఎస్‌బీఐ నుంచి ఫోన్‌లు చేస్తూ మీ బ్యాంకు వివరాలు, డెబిట్‌ కార్డు వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవదని తెలిపింది.

ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్న దృష్ట్యా కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది ఎస్‌బీఐ. అయితే చాలా మంది బ్యాంక్‌ లావాదేవీలు, బ్యాంకులకు సంబంధించి ఇతర పనులు ఎక్కువ మంది మొబైల్‌లో ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఆసరా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు నిలువునా దోచేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠాలనే పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి నిఘానే పెట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News