Sowjanya Anneboina August 1, 2026prabhanews.com

- పలాస-విజయవాడ మధ్య జనసాధారణ స్పెషల్ సర్వీసులు
- ఆగస్టు 2 నుంచి 6 వరకు నాలుగు ట్రిప్పులు..
- రిజర్వేషన్ అవసరం లేదు
- విశాఖ, విజయనగరం, రాజమహేంద్రవరం మీదుగా ప్రత్యేక రైళ్ల నిర్వహణ
విజయవాడ, ఆంధ్రప్రభ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ తీర రైల్వే పలాస-విజయవాడ మధ్య ప్రత్యేక జనసాధారణ (అన్రిజర్వ్డ్) స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ప్రజాసంబంధాల అధికారి నుస్రత్ ఎం. మండ్రుప్కర్ తెలిపారు. రైలు నెం. 07067 పలాస-విజయవాడ స్పెషల్ ఆగస్టు 2 నుంచి 5 వరకు ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు నడుస్తుంది. పలాస నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, సింహాచలం, విశాఖపట్నం, దువ్వాడ, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు మీదుగా మరుసటి రోజు రాత్రి 1 గంటకు విజయవాడ చేరుకుంటుంది.
రైలు నెం. 07068 విజయవాడ-పలాస స్పెషల్ ఆగస్టు 3 నుంచి 6 వరకు ప్రతిరోజూ నడుస్తుంది. విజయవాడ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని, దువ్వాడ, విశాఖపట్నం, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్ మీదుగా మరుసటి రోజు ఉదయం 4.30 గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో మొత్తం 12 ఐసీఎఫ్ కోచ్లు ఉండగా, అందులో 10 సాధారణ (జనరల్) బోగీలు, 2 ఎస్ఎల్ఆర్ బోగీలు ఉంటాయి. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ ప్రత్యేక రైలు సేవలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

