Thursday, 16 May, 6.01 pm ప్రభన్యూస్

అదిలాబాద్
బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇసుక దందా

-కన్నెపల్లి, నెన్నెల మండలాల్లోని వాగుల నుంచి రవాణా
-రహస్యంగా ఇసుక డంపుల ఏర్పాటు
బెల్లంపల్లి, : బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండల కేంద్రంలోని వాగుతో పాటు నెన్నెల మండలంలోని పంగిడిసోమారం, నార్వాయిపేట వాగుల్లో, బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి అటవీ ప్రాంతం నుండి, అదేవిధంగా భీమిని, జన్కాపూర్‌ వాగుల నుండి ఇసుక దందా సాగిపోతోంది. బెల్లంపల్లి పట్టణానికి ప్రతీ రోజు వందలాది ట్రాక్టర్ల ఇసుక దంధా సాగుతూ కొందరు ఏకంగా తమతమ ఇండ్లను డంపులుగా ఏర్పాటు చేసుకొని రూ.2500 నుండి రూ.3000 వరకు ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక రవాణా నిషేదం విధించినప్పటికీ ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంతో వాటికి ఆసరగా 10 ట్రాక్టర్లకు పర్మీషన్‌ ఇస్తే వందలాది ట్రాక్టర్లను తీసుకువచ్చి పెద్ద వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఒకొక్కరు ఇదే దంధాగా ఏర్పాటు చేసుకొని రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్ల మోతతో పట్టణంలో అడప దడపా తనిఖీలు నిర్వహించి అప్పుడప్పుడు పట్టుకున్నప్పటికీ ఇసుక దంధా మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతూనే ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Prabha News
Top