Tuesday, 04 Aug, 12.00 am ప్రభన్యూస్

కరీంనగర్
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- తహసీల్దార్‌కు పద్మశాలీ సంఘం వినతి
సుల్తానాబాద్ : రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సుల్తానాబాద్‌ పట్టణ పద్మశాలీ సంఘం, మండల పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ హన్మంతరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రోజువారీ పనితో కుటుంబాన్ని పోషించుకునే చేనేత కార్మికులు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాలుగు నెలలుగా పనులు లేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులున్నాయన్నారు. చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నెలకు రూ. 8వేలు, చేనేత ఉత్పత్తులను టెస్కో ద్వారా ఖరీదు చేయాలని, 50శాతం సబ్సిడీపై సరుకుల సరఫరా, చేనేత బీమా, కార్పోరేషన్‌కు రూ. వెయ్యి కోట్ల కేటాయింపు, సహకార సంఘాలకు ఎన్నికలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు గుండ మురళీ, ఆడెపు అంబదాస్‌, నాయకులు అయిల రమేశ్‌, సాయిరి మహేందర్‌, గాదాసు రవి, పెగడ చందు, సామల రాజేంద్రప్రసాద్‌, తుమ్మ రాములు, పెగడ పరశరాములు, మేరుగు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Prabha News
Top