Sowjanya Anneboina September 1, 2026prabhanews.com
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : హల్దానిలో మల్లికార్జున ఖర్గే సభ అనంతరం నిర్వహించిన శుద్ధీకరణ కార్యక్రమాన్ని సమర్థించిన ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మహేంద్ర భట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దళిత వ్యతిరేక శక్తులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పోలీసులను కోరారు. ఇలాంటి చర్యలు సామాజిక వర్గాల మధ్య విభేదాలకు దారితీసే అవకాశం ఉన్నందున చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం అధ్యక్షుడు బొంగురాల మల్లేశ్వర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్రు నరేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గంగాధర్ గౌడ్, నాయకులు వడ్నాల రాజేశ్వర్, మాజీ జెడ్పీటీసీ ఓస రాజేశ్వర్, మైనార్టీ అధ్యక్షుడు అస్గర్, మాజీ సర్పంచ్ నారాయణ, పీఏసీఎస్ డైరెక్టర్ ఎరుకరి నరేష్, సీహెచ్. శేఖర్‌రెడ్డి, పోతిరెడ్డి, ఆశన్న తదితరులు పాల్గొన్నారు.
