Thursday, 16 May, 6.01 pm ప్రభన్యూస్

అదిలాబాద్
డెంగ్యూ నివారణ కోసం ప్రతీఒక్కరు ప్రత్యేక చర్యలు చేపట్టాలి - వైద్యాధికారి సత్యనారాయణ

చెన్నూరు, : డెంగ్యూ వ్యాది సోకకుండా తమ తమ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూసుకున్నట్లయితే నివారణ సాధ్యమవుతుందని ప్రభుత్వ వైద్యాధికారి సత్యనారాయణ అన్నారు. ప్రపంచ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిబ్బందితో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నిల్వ ఉంచుకోవద్దని, నీటి నిల్వలను ఉంచుకునే పాత్రను బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి వారానికి ఒకసారి శుభ్రం చేసినట్లయితే డెంగ్యూ దోమ పరిసరాల్లో రాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి అరుణశ్రీ, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ పుట్ట సత్తయ్య, సూపర్‌వైజర్‌ మహేశ్వర్‌రెడ్డి, అచ్చుత్‌రావు, సిబ్బంది అశోక్‌, రమేష్‌, ప్రశాంత్‌, రాజమణిత, నాగమణి, స్వరూప, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Prabha News
Top