Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ద్వేషం కాదు.. దారి చూపుదాం..

ద్వేషం కాదు.. దారి చూపుదాం..

Pavan Chandragiri July 31, 2026

  • దూషణలు సమస్యలకు పరిష్కారం కాదు..
  • 'భారత్ కోసం కలిసి పనిచేద్దాం' అంటూ పిలుపు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సోషల్ మీడియాలో మరింత చురుకుగా వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన నిరసనల తర్వాత వరుసగా వీడియోలు, సందేశాలు పోస్టు చేస్తూ యువతకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

తాజాగా దూషణలు ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తప్పుదారి పట్టిన వారిని తిట్టడం కంటే వారికి సరైన దారి చూపాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో, "దూషణలు ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కావు. తప్పుదారి పట్టిన వారికి సరైన దారి చూపుదాం. కలిసి పనిచేద్దాం. భారత్ కోసం కలిసి ముందుకు సాగుదాం" అంటూ వీడియో పోస్ట్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News