Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈశ్వర వీరప్పయ్య స్వామి బ్రహ్మోత్సవాలు రద్దు..

ఈశ్వర వీరప్పయ్య స్వామి బ్రహ్మోత్సవాలు రద్దు..

దేవరకద్ర : మండల కేంద్రంలో ఈనెల 17 నుంచి ప్రారంభం కానున్న శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి బ్రహ్మోత్సవాలు రద్దు చేశామని దేవస్థానం చైర్‌ పర్సన్‌ రాధిక భాస్కర్‌ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలపై ఆలయ కమిటీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రోజు రోజుకు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి బ్రహ్మోత్సవాలు నిర్వహించరాదని ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ , అలాగే ఎండోమెంట్‌ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు ఆమె తెలిపారు.ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ఈ బ్రహ్మోత్సవాలను రద్దు చేయడం జరిగిందని ఆమె చెప్పారు. ప్రజలు కూడా తమకు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో మాజీ చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, ఈఓ కోమల్‌ , ఆలయ అర్చకులు నాగరాజు , కమిటీ సభ్యులు భిక్షపతి , బాల్‌రాజ్‌ , చెన్నయ్య , సూరిబాబు , గ్రామ పెద్దలు భీమన్న తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News