Dailyhunt
ఏనుగుల పరిరక్షణకి విరాళంగా ఆమె వాయిస్ ఓవర్

ఏనుగుల పరిరక్షణకి విరాళంగా ఆమె వాయిస్ ఓవర్

క్వీన్‌ ఎలిజిబెత్‌-2 మనవడు ప్రిన్స్‌ హ్యారీని వివాహం చేసుకుని సినిమాలకు దూరమయింది హాలీవుడ్‌ నటి మేఘన్‌ మార్కెల్‌. అయితే ఇటీవలే రాజకుటుంబం నుంచి తప్పుకుని స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నట్టు ప్రకటించారు. వెంటనే డిస్నీ సంస్థ వాళ్లు మేఘన్‌ మార్కెల్‌తో ఓ సినిమాకి ఒప్పందం కుదుర్చున్నారు. ఏనుగుల మీద డిస్నీ సంస్థ ఓ సినిమా తెరకెక్కించింది. ఈ సినిమాలో వచ్చే వాయిస్‌ ఓవర్‌ను మేఘన్‌ మార్కెల్‌ చెప్పనుంది. ఆమె పారితోషికం ఏనుగుల పరిరక్షణకి విరాళంగా వెళ్తుందట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News