Babu Bahadur April 5, 2026breaking war news, Geopolitical Tensions, Hezbollah attack Israeli ship, Hezbollah missile strike, Hezbollah retaliation attack, Israel Lebanon tensions, Israel navy attack, Israel warship missile strike, Lebanon Israel Conflict, maritime security threat, Mediterranean Sea attack, Middle East conflict news, naval cruise missile attack, Operation Devoured Straw, warship fire incident
Hezbollah Missile Attack : హిజ్బుల్లా క్షిపణి దాడి Andhra Prabha News
- మధ్యధరా సముద్రంలో ఉద్రిక్తత
- నౌకను తాకిన క్షిపణి
- ఆపరేషన్ డెవౌర్డ్ స్ట్రా ప్రతీకారం
- ప్రాణనష్టం వివరాలపై ఇజ్రాయెల్ మౌనం
(ఆంధ్రప్రభ. జెరుసలేం ప్రతినిధి)
Hezbollah Missile Attack : హిజ్బుల్లా సాయుధ బృందం ఇజ్రాయెల్ యుద్ధనౌకపై నావికా క్రూయిజ్ క్షిపణితో దాడి చేసినట్లు ప్రకటించింది. 2026 ఏప్రిల్ 5, ఆదివారం తెల్లవారుజామున హిజ్బుల్లా దళాలు ఇజ్రాయెల్ యుద్ధనౌకను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశాయి. లెబనాన్ తీరానికి సుమారు 68 నాటికల్ మైళ్ల దూరంలో మధ్యధరా సముద్రంలో ఈ దాడి జరిగింది. ఒక నావికా క్రూయిజ్ క్షిపణినిప్రయోగించింది. లెబనాన్ భూభాగంపై దాదికి సిద్ధమవుతుండగా క్షిపణిని ప్రయోగించినట్లు హిజ్బుల్లా బృందం పేర్కొంది. ఈ క్షిపణి నేరుగా నౌకను తాకిందని (Direct Hit), దీనివల్ల నౌకలో మంటలు చెలరేగాయని హిజ్బుల్లా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడి లో ప్రాణనష్టం ఆస్తి నష్టంపై ఇజ్రాయెల్ నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. లెబనాన్‌లోని మౌలిక సదుపాయాలు జనవాసాలపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఈ "ఆపరేషన్ డెవౌర్డ్ స్ట్రా" (Operation Devoured Straw) చేపట్టినట్లు హిజ్బుల్లా వెల్లడించింది.

