Iran Rejects : రెడ్​ లైన్​ దాటొద్దు Andhra Prabha News

Iran Rejects : రెడ్​ లైన్​ దాటొద్దు Andhra Prabha News

ప్రభన్యూస్

ప్రభన్యూస్

13hr

Loading...

Babu Bahadur April 7, 2026Gulf war escalation news, Hormuz sovereignty Iran, Iran army statement news, Iran human shield strategy, Iran Israel tension, Iran military response Trump, Iran rejects Trump warning, Iran US Conflict Latest, Masoud Pezeshkian statement, Middle East Crisis 2026, Strait of Hormuz tension, US bases threat Iran

Iran Rejects : రెడ్​ లైన్​ దాటొద్దు Andhra Prabha News

  • అదే జరిగితే.. ప్రతీకారమే
  • మధ్యప్రాచ్చంలోనే కాదు
  • ప్రపంచ వ్యాప్తంగా రివేంజ్​ తప్పదు
  • హోర్ముజ తెరవం
  • అది మా సొంతం
  • ట్రంప్ వ్యాఖ్యలు భ్రమ
  • ఇరాన్ కాపాడుకుంటాం
  • 14 మిలియన్లు రెడీ
  • ప్రాణత్యాగానికి కట్టుబడ్డాం
  • అమెరికాకు ఐఆర్జీసీ వార్నింగ్​

( ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి)

అమెరికా 'రెడ్ లైన్లు' దాటితే ప్రపంచవ్యాప్త ప్రతీకారం తీర్చుకుంటాం, అని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా తమ "రెడ్ లైన్లను" ఉల్లంఘిస్తే, మధ్యప్రాచ్యానికి అవతల కూడా ప్రతీకారం తప్పదని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మంగళవారం ప్రకటించింది. "అమెరికా ఉగ్రవాద సైన్యం రెడ్ లైన్లను దాటితే, మా ప్రతిస్పందన ఈ ప్రాంతానికి ఆవల ఉంటుంది అని రివల్యూషనరీ గార్డ్స్ మరోసారి ప్రకటిస్తోంది," అని ఆ ప్రకటన పేర్కొంది. వాషింగ్టన్ మిత్రదేశాలు చమురు, గ్యాస్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది.

Iran Rejects : అదొక భ్రమ.. అహంకారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ చాలా ఘాటుగా ధిక్కారించింది. ట్రంప్ వ్యాఖ్యలు ఓ భ్రమ "ఒక్క రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తాం అనే వ్యాఖ్యను ఇరాన్ సైన్యం కొట్టిపారేసింది. ఇవి "అహంకారం, భ్రమలతో కూడిన వ్యాఖ్యలు" అని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు హార్ముజ్ (Strait of Hormuz) జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మార్గాన్ని ఇరాన్ తన "సార్వభౌమ హక్కు"గా భావిస్తోంది అని నొక్కి వక్కాణించింది.

Iran Rejects : తగిన రీతిలో ప్రతిఘటిస్తాం

తమ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేస్తే, దానికి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రతిఘటిస్తాం అని ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు మిత్రదేశాలపై దాడులు చేస్తామని పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వ పిలుపు మేరకు, ఇరానీలు తమ దేశంలోని పవర్ ప్లాంట్లు కీలక ఆస్తుల చుట్టూ "మానవ గొలుసులు"గా ఏర్పడి అమెరికా దాడులను అడ్డుకోవాలని ఇరాన్ అధికారులు కోరారు ట్రంప్ ప్రతిపాదించిన కొత్త ఒప్పందం ఇరాన్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, బెదిరింపులకు లొంగి చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్‌ను రక్షించుకోవడానికి 14 మిలియన్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కట్టుబడి ఉన్నారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అన్నారు.

ALSO READ : Trump Final Warning : ఇదే ఆఖరి రాత్రి Andhra Prabha News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News