Thursday, 16 May, 6.01 pm ప్రభన్యూస్

అదిలాబాద్
కన్నెపల్లిలో కుక్కల స్వైర విహారం - భయబ్రాంతుల్లో గ్రామస్తులు

కన్నెపల్లి, : కన్నెపల్లి మండల కేంద్రంలో ఎక్కడ చూసినా కుక్కలే దర్శనమిస్తున్నాయి. మండల కేంద్రంలో కుక్కలు గుంపు గుంపులుగా తిరుగుతూ ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కన్నెపల్లి మండలంలోని దుకాణాల వద్ద, రైస్‌మిల్లుల వద్ద గుంపుగుంపులుగా ఉంటూ వచ్చి పోయే వారి కోసం దారి కాస్తున్నట్లే కనిపిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికే చాలా పశువులను కరిచాయని, ప్రజలను కూడా భయబ్రాంతులకు గురి చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని, పంచాయితీ అధికారులకు విన్నవించినప్పటికీ కుక్కల నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఈ కుక్కల బెడతో చిన్నారులను బయటకు పంపడం లేదు. ఇప్పటికైనా కన్నెపల్లిలో కుక్కల బెడదను తీర్చకపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Prabha News
Top