
ప్రపంచం మొత్తం కరోనా గురించి వణికిపోతోంది. ఈ నేపథ్యంలో సినీ నటి, సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి మాట్లాడుతూ అచ్చం ఇలాంటి కథతోనే 2011లో 'కంటేజియన్' అనే సినిమా వచ్చిందని తెలిపింది. ఆ సినిమా నిండా ఇప్పుడు మనం వింటున్న పదజాలమే ఉంటుందని. వైరస్ ఎంత త్వరగా వ్యాపిస్తుందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుందని తెలిపింది. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని సూచించింది.