Dailyhunt
ఖమ్మంలో పట్టుబడిన 75 కేజీల గంజాయి

ఖమ్మంలో పట్టుబడిన 75 కేజీల గంజాయి

ఖమ్మం జిల్లాలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జీ.అంజన్ రావు ఆదేశానుసారం భద్రాచలంలో ప్రత్యేకంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ముగ్గురు బిహారీ వ్యక్తుల వద్ద నుండి 75 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విలువ మార్కెట్లో రూ. 7.5 లక్షల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News