Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Last Man in Tower | 'ది ఫ్యామిలీ మ్యాన్‌' తర్వాత మనోజ్ బాజ్‌పేయి సినిమా

Bharath September 1, 2026prabhanews.com

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: 'ది ఫ్యామిలీ మ్యాన్‌' వెబ్‌ సిరీస్‌ లోతనదైన నటనతో ఆకట్టుకున్న మనోజ్ బాజ్‌పేయి మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈసారి ఆయన ఎంచుకున్న కథ సాధారణమైనది కాదు. ముంబయి నేపథ్యంలో మనుషుల ఆశలు, విలువలు, ఒత్తిళ్లు, చివరికి ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం చుట్టూ తిరిగే కథతో 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమా అరవింద్ అడిగ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. పుస్తకంలోని కథను తెరపైకి తీసుకొచ్చే బాధ్యతను దర్శకుడు బెన్ రేఖీ చేపట్టగా, ప్రముఖ రచయిత సూనీ తారాపోర్‌వాలా కథను సినిమాకు అనుగుణంగా మలిచారు. ఈ కాంబీనేషన్‌ కారణంగానే సినిమాపై మొదటి నుంచే ఆసక్తి కలిగించింది.

ఇందులో మనోజ్ బాజ్‌పేయి 'మాస్టర్‌జీ' అనే పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. తన చుట్టూ ఉన్నవాళ్లు ఒక నిర్ణయం తీసుకునే సమయంలో మాత్రం ఆయన ఒంటరిగా మరో వైపు నిలబడతారు. అదే ఈ కథకు అసలు మలుపుగా మారుతుంది. ఒక సమాజం మొత్తం ఒక దిశగా వెళ్తున్నప్పుడు అందుకు వ్యతిరేకంగా నిలబడే వ్యక్తి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? తన నమ్మకాల కోసం ఎంతవరకు పోరాడగలడు? అన్నదే కథలో కీలకంగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో బొమన్ ఇరానీ, దివ్య దత్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్ రెక్హి దర్శకత్వం వహించగా.. రానా దగ్గుబాటికి చెందిన 'స్పిరిట్ మీడియా' ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' సెప్టెంబర్‌ 11న థియేటర్లలోకి రానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News