Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Latest Trend | హిట్లు కొడుతున్నారు..

Latest Trend | హిట్లు కొడుతున్నారు..

Latest Trend | హిట్లు కొడుతున్నారు..

Latest Treand, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి.. ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ఒకసారి యాక్షన్ ట్రెండ్ నడిస్తే..

మరోసారి లవ్ స్టోరీస్ ట్రెండ్ నడుస్తుంటుంది. ఇంకోసారి హర్రర్ ట్రెండ్ నడుస్తుంటుంది. ఇలా.. కాలం మారినట్టుగా ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వస్తుంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం రచయితలు, దర్శకులు కొత్త కథలతో సినిమాలు తీసే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. ఈమధ్య కాలంలో కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే కథలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. ఇది ఓ ట్రెండ్ గా మారింది. ఇప్పుడు ఈ రూటులో మరిన్ని సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ.. ఈమధ్య కాలంలో ఈ తరహాలో వచ్చిన సినిమాలు ఏంటి..? రాబోతున్న సినిమాలు ఏంటి..?

Latest Trend | కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన ఆర్ఆర్ఆర్..

మెగా హీరో రామ్ చరణ్‌, నందమూరి హీరో ఎన్టీఆర్.. వీరిద్దరూ కలిసి నటించిన మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా కథ స్వాతంత్ర్యం రాక ముందు జరిగిన కథ. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ విభిన్న కథా చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను కాదు.. పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ చరిత్ర సృష్టించిన పుష్ప మూవీ కూడా కాలాన్ని వెనక్కి తీసుకెళ్లింది. ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. అలాగే సలార్, టైగర్ నాగేశ్వరరావు, దసరా, డెవిల్, విరూపాక్ష తదితర చిత్రాలు, తాజాగా వచ్చిన ఛాంపియన్ మూవీ కూడా కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన సినిమానే..

Latest Trend | 18వ శతాబ్ధం కథతో మహేష్ మూవీ..

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న భారీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ అయితే.. అంచనాలను మరింతగా పెంచేసింది. ఇందులో మహేష్‌ బాబు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అయితే.. కథ ఏంటి అనేది చెప్పలేదు కానీ.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సమకాలీన అంశాలతో పాటు 18వ శతాబ్దం నేపథ్యంలో కీలక ఘట్టాలను చూపించబోతున్నారని తెలిసింది. 2027లో ఈ భారీ పాన్ వరల్డ్ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Latest Trend | బ్రిటీష్ సైనికుడుగా ప్రభాస్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. హను రాఘవపూడితో ప్రభాస్ ఫౌజీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ ఏంటి అనేది మేకర్స్ బయటపెట్టలేదు కానీ.. ఇది బ్రిటీష్ కాలం నాటి కథతో రూపొందుతోందని సమాచారం. 1945 స్వాతంత్య్ర సంగ్రామం నేపథ్యంలో నడిచే కథ ఇదని.. ఇందులో ప్రభాస్‌ బ్రిటిష్‌ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. స్వాతంత్య్రసిద్ధికి యుద్ధం ఒక్కటే పరిష్కారమని నమ్మే యోధుడిగా ప్రభాస్‌ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని.. దేశభక్తి, ప్రేమ, త్యాగం, పోరాటం ఈ అంశాలన్నిటిని కలిపి ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నారట. ఈ మూవీని నెక్ట్స్ ఇయర్ ఆగష్టులో రిలీజ్ చేయనున్నారు.

Latest Trend | ట్రెండ్ ఫాలో అవుతున్న యంగ్ హీరోలు..

మహేష్‌ బాబు, ప్రభాస్, రామ్ చరణ్‌, ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోలే కాదు.. యంగ్ హీరోలు సైతం.. ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో భారీ పీరియాడిక్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమా 1854 -1978 మధ్యకాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల నేపథ్య కథాంశమిది. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. అలాగే నాని ప్యారడైజ్, శర్వానంద్, సంతప్ నంది మూవీ, నిఖిల్ స్వయంభూ తదితర చిత్రాలన్నీ పీరియాడిక్ సినిమాలే. ఈ తరహా సినిమాలకు ఆదరణ బాగుంటుండడంతో ఈ తరహా సినిమాలు చేసేందుకు హీరోలు, దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి.. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే కథలతో రాబోతున్న ఈ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయేమో చూడాలి.

CLICK HERE TO READ అందుకే.. ఆయనకు ఫ్యాన్ అయ్యాను

CLICK HERE TO READ MORE

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prabha News