సుచీలీక్స్ వివాదంపై హీరోయిన్ ఆండ్రియా జెర్మియా స్పందిస్తూ.. అనిరుధ్, తన ఫోటోలు వాస్తవమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అవి చాలా కాలం క్రితం తీసిన ఫోటోలు. మా మధ్య అలాంటి రిలేషన్ ఉంది. దానిని దాచడానికి భయం లేదు. కానీ కొన్ని వ్యక్తిగతంగా ఉండాల్సినవి బహిరంగం కావడమే బాధగా ఉందని. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో తనకు మంచి బాండింగ్ ఉందని తెలిపింది. మా మధ్య లవ్ అనేది సాధారణమైన విషయం. లిప్‌లాక్ విషయం గురించి, మాట్లాడుకోవడానికి, దాని గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు. ఫోటోలు లీక్ అయిన తర్వాత అనిరుధ్ నాకు సారీ చెప్పాడు. తన ప్రమేయం లేకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పబ్లిష్ అయ్యాయని వివరణ ఇచ్చాడు అని ఆండ్రియా తెలిపింది.

