Thursday, 16 May, 6.01 pm ప్రభన్యూస్

అదిలాబాద్
మంచిర్యాల క్లబ్‌లో స్విమ్మింగ్‌ ఉల్లాసం

మంచిర్యాల, : వేసవి నుండి ఉపశమనం కల్గించేందుకు స్విమ్మింగ్‌ ఇటు విద్యార్థులతో పాటు పెద్దవారిలో సైతం ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ నేపథ్యంలోనే మంచిర్యాల క్లబ్‌ ఆధ్వర్యంలో అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈత కొలను అందరిని ఆకట్టుకుంటుంది. పెద్దఎత్తున స్విమ్మింగ్‌తో సేద తీరే వారు క్లబ్‌ ఈత కొలనులో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. ఐదు సంవత్సరాల సినియార్టీతో
కోచ్‌ ఓదెలు నేర్చుకునే వారికి ఉత్తేకరమైన శిక్షణను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే నేషనల్‌ స్థాయిలో సైతం గుర్తింపు క్రీడాకారులను తయారు చేయగా రాష్ట్రస్థాయిలో బహుమతులు సైతం అందుకున్న ఘనత మంచిర్యాల క్లబ్‌ స్విమ్మింగ్‌ఫూల్‌కే దక్కింది. ఈ సందర్భంగా కోచ్‌ ఓదెలు మాట్లాడుతూ స్విమ్మింగ్‌ పిల్లలతో పాటు పెద్దల్లో చురుకుదనాన్ని పెంచడం, నరాల కణజాలం వేగంగా పనిచేయడం, శరీరంలోని నొప్పులు, రక్తప్రసరణ వేగంగా జరగడం, ఆరోగ్యంలో నూతన ఉత్తేజంతో పాటు వెన్నునొప్పి తక్కువ అయ్యే అవకాశం ఉండటం, ముఖ్యంగా చిన్నప్పటి నుండి స్విమ్మింగ్‌లో ఆరితేరి ఉంటే పిల్లలు ప్రమాధాలకు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని, అందుకే స్విమ్మింగ్‌ను పూర్తి ఫిట్‌నెస్‌ వ్యాయమంగా వినియోగించుకోవచ్చునని, నేర్చుకునే వారు ఉత్తేజంగా పాల్గొంటే 25 నుండి 30 రోజుల్లో పూర్తిస్థాయి స్విమ్మింగ్‌ వచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అలాగే నీటి శుభ్రతతో పాటు, స్కిన్‌ అలర్జీలు రాకుండా డాక్టర్‌ చికిత్సల అనంతరం క్లబ్‌ ఈత కొలనులో స్విమ్మింగ్‌కు అనుమతిస్తున్నామని కోచ్‌ ఓదెలుతో పాటు మేనేజర్‌ రాజారాం తెలిపారు. అన్ని జాగ్రత్తలతో సౌకర్యాలకు ఈత కొలను అందుబాటులో ఉందని, వేసవి ఉల్లాసాన్ని తీర్చుకోవడానికి ఉత్సాహవంతులు పాల్గొనాలని వారు కోరారు. అదేవిధంగా మంచిర్యాల క్లబ్‌ అధ్యక్షుడు గడ్డం అరవిందరెడ్డి మాట్లాడుతూ క్లబ్‌లో అన్ని క్రీడా సౌకర్యాలతో పాటు స్విమ్మింగ్‌ ఉల్లాసాన్ని సైతం పెంచామని, అయితే మెంబర్లకు కాకుండా బయటి వారికి తక్కువ రుసుముతో అవకాశం కల్పిస్తున్నామని, జాగ్రత్తలను పాటిస్తున్నామని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Prabha News
Top