Pavan Chandragiri August 1, 2026

- పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా మృతి
- మరో ఐదుగురు పర్వతారోహకులూ దుర్మరణం
ఆంధ్రప్రభ : ప్రపంచంలోనే 12వ ఎత్తైన పర్వత శిఖరమైన బ్రాడ్ పీక్ వద్ద సంభవించిన భారీ హిమపాతంలో ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ 'నిమ్స్' పుర్జా మృతి చెందారు.
నేపాల్ మూలాలున్న ఆయనతో పాటు మరో ఐదుగురు పర్వతారోహకులు గురువారం నుంచి గల్లంతుకాగా, వారంతా ప్రాణాలు కోల్పోయినట్లు ఆయనకు చెందిన అడ్వెంచర్ సంస్థ ఎలైట్ ఎక్స్‌పెడ్ అధికారికంగా ప్రకటించింది.
నిర్మల్ పుర్జా ఆరు నెలల్లోనే ప్రపంచంలోని 14 అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన ఆకస్మిక మరణంతో ప్రపంచ పర్వతారోహణ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది.

