దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతునే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఏడు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. తాజాగా హైదరాబాద్ లోను పెట్రోలు రేటు లీటరు వంద రూపాయలు దాటింది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కెట్‌ను ధాటింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.100.20కు చేరగా.. డీజిల్ లీటర్ రూ.95.14కు పెరిగింది. దాదాపు ఐదారు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది.
గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వస్తుండగా.. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 31 పైసలకు పెరిగింది.

