ఫుట్‌బాల్ అభిమానులకు మరో షాక్ తగిలింది. మార డోనా మరణ వార్త మరువకముందే మరో దిగ్గజం కన్ను మూసింది. ఇటలీ దిగ్గజ ఫుట్‌బాలర్ పాలో రోసీ (64) గురువారం ఉదయం మరణించారు. ఆయన మరణ వార్తను పాలోరోసీ భార్య ఫెడెరికా కాపెల్లేటి ఇన్‌స్టాగ్రా మ్‌లో ధ్రువీకరించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్టులో రోసి మిస్ యూ ఫర్‌ఎవర్ అని పేర్కొన్నారు. 1982లో స్పెయిన్‌లో జరిగిన సాకర్ ప్రపంచకప్ పోటీల్లో ఇటలీ ప్రపంచవిజేతగా నిలవడంలో రోసి కీలకపాత్ర పోషించారు. ఆనాటి ప్రపంచకప్ పోటీల్లో పాలొరోసీ 6గోల్స్ చేసి గోల్డెన్ బూట్ అందుకున్నారు. లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్‌పై హ్యాట్రిక్ సాధించారు. సెమీస్‌లో పోలాం డ్ రెండు గోల్స్, పశ్చిమ జర్మనీతో ఫైనల్లోనూ గోల్ సాధిం చారు.

