బాలీవుడ్ నటి రాధిక ఆప్టే ఆసుపత్రిలో ప్రత్యక్షమైయింది. దాంతో ఆమె కూడా కరోనా వైరస్ బారిన పడిందని.. ఆమె ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటోందని వార్తలు వచ్చాయి. రాధిక ఫొటో చూసి `గల్లీబాయ్` ఫేమ్ విజయ్ వర్మ.. `ఓ గాడ్.. జాగ్రత్త డార్లింగ్.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు` అని కామెంట్ చేశాడు. దీంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. ఈ కామెంట్లు మరీ ఎక్కువైపోవడంతో తాజాగా రాధిక క్లారిటీ ఇచ్చింది. తాను కరోనా వైరస్ బారిన పడలేదని స్పష్టం చేసింది. `నేను హాస్పిటల్‌కు వెళ్లాను. అయితే కోవిడ్-19 పరీక్షల కోసం మాత్రం కాదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండని రాధిక పోస్ట్ చేసింది.

