ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ : సంక్షోభం ముగిసింది- రికవరీ బాటలో ఆర్థిక వ్యవస్థ

కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ బయటపడిందని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ప్రకటించింది. రికవరీ చాలా దృఢంగా ఉందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వాస్తవ జీడీపీ పాజిటివ్ గా 0.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. కోవిడ్ మహమ్మారి రెండో దఫా విజృం భణను అడ్డుకోవడంతో భారత్ విజయవంతమవ్వడం తో సానుకూల వృద్ధి ఖాయమని విశ్లేషించింది. దాదాపు నాలు గు తర్వాత నవంబర్‌లో ప్రభుత్వ వ్యయాలు ఏకంగా 43 శాతం పెరిగాయి. ఆత్మనిర్భర్ భారత్ కింద రాష్ట్రాలకు ఈ నిధు లు అందాయి. బ్యాంకుల క్రెడిట్ డిమాండ్ కూడా 6 శాతా నికిపైగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కూడా మెరు గయిందని రిపోర్ట్‌లో పేర్కొంది.
కరోనాను జయించడానికి ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియతో ఆర్థిక వ్యవస్థలో కొత్త ఆశావాదం మొదలయిందని హర్షం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ మరో దఫా విజృంభించకపోతే దారుణ పరిస్థితులు సమసిపో యినట్టేనని బుధవారం విడుదల చేసిన జనవరి బులిటెన్‌లో ఆర్బీఐ పేర్కొంది. రికవరీ దృఢమైన బాటలో కొనసాగు తోందని ఇటివలి వెలువడిన పలు కీలకమైన సూచీలు స్పష్టం చేశాయి. ఆర్థిక వ్యవస్థ స్థితిని వర్ణిస్తూ.. త్వరలోనే మన అసం తృప్తుల చలికాలం అందమైన వేసవిగా మారుతుందని విలి యం షేక్‌స్పీయర్ మాటలను ప్రస్తావించింది. ఇటివలి స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశాజనంగా మారాయి. జీడీపీ సానుకూల పరిస్థితుల్లోకి అడుగుపెట్టింది. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా లక్ష్యానికి దగ్గరగా చేరువవుతోంది. ఇదే విధంగా పరిస్థితులు కొనసాగితే రికవరీకి ఊతమిచ్చే చర్యలకు మరింత ఆస్కారం ఉంటుందని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. భారత్ ఇతర దేశాల కంటే వేగంగా కోలుకుంటోంది. పెద్ద రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాధారణ పరిస్థితులకు చేరువలో ఉన్నాయి. పెరిగిన ఈ-వే బిల్లులు దేశీయ వాణిజ్య వ్యాపార కార్యకలాపాలను తెలియజేస్తు న్నాయని ఆర్బీఐ పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థలో మెరుగయిన పరిస్థితులు స్పష్టంగా కనిపిసు ్తన్నాయని ఆర్బీఐ వెల్లడించింది. దేశీయ వ్యయాలు వేగంగా సాధారణ పరిస్థితికి చేరుకుంటున్నాయి. డిసెంబర్ 2020లో రికార్డయిన ఈ-వే బిల్లులు అత్యధికంగా ఉన్నాయి. పండగ సీజన్ రికవరీ ఎక్కువ కాలం కొనసాగదు. మరోవైపు జీఎస్టీ వసూళ్లు డిసెంబర్‌లో జీవితకాల గరిష్ఠంగా నమోద య్యాయి. అన్‌లాక్ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య కార్యకలా పాలు మెరుగుపడడం, అంతేకాకుండా రిటర్నులు దాఖలు నిబంధనలు సులభతరం చేయడం కూడా జీఎస్టీ వసూళ్ల పెరుగుదలకు కారణమైంది. విని యాగదారుల ఆత్మవిశ్వాసం పెరుగుతో ందని పేర్కొంది. కరెంట్ ఖాతా మిగులు మూడో త్రైమాసికంలో కూడా మిగు లుగానే ఉంది. రెండో త్రైమాసికంలో కరెంట్ ఖాతా క్షీణించడం మొదలైంది. రెండో అర్ధభాగంలో కరెంట్ ఖాతా మ రింత పతనమయ్యే అవకాశాలున్నాయని రిపోర్ట్ పేర్కొంది.
ఉపాధిలోనూ మెరుగుదల
మరోవైపు ఉపాధి విషయంలో లేబర్ మార్కెట్ పరిస్థితులు కూడా క్రమంగా మెరుగుపడుతున్నాయని రిపోర్ట్ పేర్కొంది. డిసెంబర్‌లో లేబర్ మార్కెట్ భాగస్వాముల రికవరీ రేటు 40.06 కాగా ఏప్రిల్ 2020లో ఇది 35.57 గా ఉందని రిపోర్ట్ వివరించింది. రాష్ట్రాల మధ్య క్రమంగా రాకపోకలు ప్రారంభ మవ్వడం, కోవిడ్ ముందు స్థాయిలతో పోల్చితే భాగస్వామ్య కార్మికుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని ఆర్బీఐ రిపో ర్ట్ వివరించింది. రానున్న నెలల్లో ఉపాధి కల్పన మరింత ఆశాజనకంగా ఉండనుందని అంచనా వేసింది. ఇటివల కాలంలో ప్రభుత్వ వ్యయాలు బాగా పెరిగాయని రిపోర్ట్ పేర్కొంది.
పెట్టుబడులు ఎంతో అవసరం
దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపథంలో కొనసాగేందుకు పెట్టు బడులు ఎంతోగానో ఉపకరిస్తాయని ఆర్బీఐ రిపోర్ట్ సూచిం చింది. బ్యాంకులు, కార్పొరేటు కంపెనీల బ్యాలెన్స్ షీట్లపై దృష్టిపెట్టాలని దృష్టిపెట్టాలని కోరింది. కీలకమైన రంగాలకు రుణం లభించేలా రివర్స్ రేపో రేటును ఆర్బీఐ సవరించాలి. పెట్టుబడులపై వాస్తవ వ్యయాలు పెరగాలని సూచించింది. మారటోరియం, రుణ పునరుద్ధరణ, అసెట్ క్లాసిఫికేషన్ సందిగ్ధం నేపథ్యంలో రుణ ఫైనాన్షియల్ రంగంలో బ్యాలెన్స్ షీట్ ఒత్తిళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ సంక్షోభం అయినప్పటికీ బ్యాంకులు దృఢమైన మూలధనం తో సానుకూలంగా ఉన్నాయని రిపోర్ట్ వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో జీడీపీ వృద్ధికి గణాంకాల మద్దతు లభించనుంది. వినియోగం పెరుగుదల జీడీపీ పెరుగుదలకు దోహదపడనుంది. అంతర్జాతీయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వడంతో వ్యాక్సిన్ ఉత్పత్తికి, ఫార్మాష్యూటికల్స్ ఎగుమతులకు కేంద్రంగా ఉన్న భారత్‌లో వృద్ధి వేగం పుంజుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు వ్యవసాయరంగ ఎగుమతులు దృఢంగా ఉండనున్నాయని తెలిపింది.